ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గురువారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలు పాడారు. అదే విధంగా రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్ అమయ్‌కుమార్ పాల్గొని కోలాటం ఆడారు. మహిళా అధికారులు బతుకమ్మ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు.
– న్యూస్‌నెట్‌వర్క్, నమస్తే తెలంగాణ