ఇబ్రహీంపట్నం, జూన్ 21 : నియోజకవర్గంలో మంగళవారం యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల, బాలుర ఉన్నత పాఠశాలతో పాటు ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. యోగా గురువులు యోగాసనాలు వేయించారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, పెద్దఅంబర్‌పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో యోగాడేను నిర్వహించారు.
షాద్‌నగర్‌రూరల్:ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులచే యోగాసనాలు వేయించారు. కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గోపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కడ్తాల్(ఆమనగల్లు) : నిత్యం యోగా చేయడం ద్వారా శారీరక, మానసికంగా ఉల్లాసంగా జీవనాన్ని కొనసాగించవచ్చని ఆమనగల్లు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి సంపతిరావు చందన అన్నారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులతో కలిసి జడ్జి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ దైనందిక జీవితంలో యోగాను ప్రతి ఒక్కరూ అంతర్భాగంగా చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఫార్చ్యూన్ బట్టర్పై స్కూల్ చైర్మన్ శేషగిరిరావు ఆధ్వర్యంలో కడ్తాల్ మండల కేంద్రంలోని ఎఫ్బీసీ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థుల యోగాసనాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల వైస్ చైర్మన్ రమేశ్, ప్రిన్సిపాల్ సంజీవ్నాంపల్లి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
షాబాద్: షాబాద్ మండలంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మహర్షి వేద గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువకులు పాల్గొని యోగా ఆసనాలు వేశారు. విద్యార్థులు యోగాపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేద పాఠశాల నిర్వాహకులు సోమశేఖర్, యువకులు ప్రవీణ్, లిఖిత్, రమేశ్, శివ, శ్రీధర్, రాము, హరీశ్, సూర్యప్రకాశ్, శ్రీశైలం, శ్రీకాంత్ తదితరులున్నారు.
షాద్‌నగర్‌టౌన్ : ప్రతి రోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యోగా ద్వారా కలిగే లాభాలను పతంజలి యోగా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు శశిధర్ వివరించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ భాను ప్రకాశ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీవర్ధన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, బండారి రమేశ్ పాల్గొన్నారు.
మంచాల : మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో యువకులు, చిన్నారులు, పెద్దలు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరుట్లలో యోగా గురువు ఎండీ సలాం ఆధ్వర్యంలో గ్రంథాలయ ఆవరణలో యోగా వల్ల కలిగే లాభాలను వారికి వివరించి వారిచే ఆసనాలు చేయించారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : యోగా డే సందర్భంగా మండలంలోని రాయపోల్, ముకునూరు, దండుమైలారం, కప్పాడు, చర్లపటేల్‌గూడ, ఎలిమినేడు, ఉప్పరిగూడ, పోచారంతో పాటు పలు గ్రామాల్లో యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేయించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆధ్వర్యంలో యోగా ఆసనాలు వేశారు.
కొందుర్గు : జిల్లెడు చౌదరిగూడ మండలంలోని ఇంద్రానగర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో టెక్నికల్ అసిస్టెంట్ వినోద్ కుమార్ యోగా చేయించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
శంకర్పల్లి : రావుస్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు యోగా చేశారు. మహాలింగపురం గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో పోటీలు నిర్వహించారు.
చేవెళ్ల రూరల్ : దేవరంపల్లి పంచాయతీ కార్యాలయంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. యోగా ప్రతి రోజు చేయడం వల్ల అనేక ప్రయోజ నాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యూత్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరేందర్, సురేందర్‌రెడ్డి, కార్యదర్శి మహ్మద్ ఫయాజ్, ట్రైనర్ రాఘవేందర్ ఉన్నారు.
పెద్దఅంబర్‌పేట : పెద్దఅంబర్‌పేటలోని జడ్పీహెచ్ స్కూల్లో ఉదయం గంటపాటు యోగా చేశారు. ఇందు హరితలో కౌన్సిలర్ మద్ది నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. తట్టిఅన్నారంలోని శ్రేయాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో వివేకానంద కేంద్రం, కన్యాకుమారి నాగోల్ బ్రాంచ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, హార్ట్ ఫుల్నెస్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్ జిల్లా స్థాయి యోగా శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణయాదవ్, సురేందర్‌యాదవ్, వివేకానంద కేంద్రం సంచాలకులు హీరాలాల్, కాలేజీ ప్రిన్సిపాల్ సాయి సత్యనారాయణరెడ్డి, ఎన్ఎస్ఎస్ పీవో స్వాతి గౌరోజు తదితరులు పాల్గొన్నారు.
యాచారం : ప్రభుత్వ, ప్రైవే టు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు యోగాసనాలు వేశారు. చింతపట్ల పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి యోగా చేశారు. మొండిగౌరెల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఏపీవో లింగయ్య ఆధ్వర్యంలో యోగా చేశారు.