కడ్తాల్, జూలై 31: మండల పరిధిలోని గోవిందాయిపల్లి తండాలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తండాలోని గిరిజనుల ఆరాధ్యదైవమైన ముత్యాలమ్మ ఆలయంలో ఉదయం భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. సాయంత్రం తండాలోని ప్రధాన వీధులగుండా అమ్మవారి విగ్రహాంతోపాటు, గిరిజన మహిళలు, యువతులు బోనాలను ఊరేగించి అమ్మ వారికి సమర్పించారు.
బోనాల సందర్భంగా గిరిజన యువతీ, యువకులు, మహిళల నృత్యాలు ఆకట్టుకున్నాయి. బోనాల పండుగకు హాజరైన ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయలకు ప్రతీక అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్ రాములునాయక్, ఎంపీటీసీ లచ్చిరాంనాయక్, ఉప సర్పంచ్‌లు శిరీషా సంతోశ్, నాయకులు శ్రీరాంనాయక్, ఛత్రునాయక్, శివరాంనాయక్, రాజూనాయక్, కుమార్‌నాయక్, ఇర్షాద్, బిక్కూనాయక్, మన్యా, సాయిలాల్, సేవాలాల్, శంకర్, రవినాయక్ పాల్గొన్నారు.