షాద్‌నగర్, జూలై 30 : షాద్‌నగర్ మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని, మున్సిపాలిటీలో ప్రగతి పనులకు రూ. 14.60 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
పట్టణంలోని అన్ని కాలనీల్లో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇప్పటికే పలు వార్డుల్లో 100 శాతం సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువల నిర్మాణాలు, మిషన్ భగీరథ పనులు పూర్తి అయ్యాయని గుర్తు చేశారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజాప్రతినిధులతో పాటు ప్రజల భాగస్వామ్యం తప్పకుండా ఉండాలని కోరారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం టీయూఎఫ్యూడీసీ ద్వారా నిధులు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మున్సిపల్ చైర్మన్ నరేందర్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సభ్యులు ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, మున్సిపల్ కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, కానుగు అంతయ్య, చెట్ల పావణి, సర్వర్‌పాష, జీటి శ్రీనివాస్, ప్రేమలత, జూపల్లి కౌసల్య, ఒగ్గు కిషోర్, మామిడి లతాశ్రీ, మహేశ్వరి, సరిత, అధికారులు పాల్గొన్నారు.
షాద్‌నగర్ పట్టణానికి చెందిన పలువురి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అందజేశారు. షాద్‌నగర్‌కు చెందిన నాగలక్ష్మికి రూ. 60 వేలు, విజయ్‌నగర్ కాలనీకి చెందిన వీరేశంకు రూ.40 వేల చెక్కును అందజేశారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్, నాయకులు మన్నె నారాయణయాదవ్, జూపల్లి శంకర్లు పాల్గొన్నారు.