రంగారెడ్డి, జూలై 26 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. చేవెళ్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో భారీ వర్షం కురువగా.. అత్యధికంగా చేవెళ్ల మం డలంలోని కందవాడలో 13 సెంటీమీటర్లు, షాబాద్ మండలంలోని షాబాద్‌లో 12.1 సెం. మీ, తాళ్లపల్లిలో 9.7 సెం.మీ, చందన్వెల్లిలో 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అయి తే అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ఎడతెరిపిలేని వర్షంతో జిల్లాలోని ప్రధానమైన మూసీ, ఈసీ నదులు మంగళవా రం ఉదయం నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నా యి. ఈసీ, మూసీలు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లకు వరద ప్రవాహం పెరిగి నిండుకుండలా మారా యి.
మరోవైపు ఈసీ, మూసీలతోపాటు షాద్‌నగర్ నియోజకవర్గంలోని పలు వాగులు భారీగా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో షాబాద్, మొయినాబాద్, ఫరూఖ్‌నగర్, నందిగామ మండలాల్లో ని పలు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. అదేవిధంగా వర్షాలతో ఇబ్రహీంపట్నం మండలంలోని శిథిలావస్థకు చేరిన పలు ఇండ్లు నేలకూలాయి. శిథిలావస్థకు చేరిన ఇండ్లల్లో ప్రజలెవరూ ఉండొద్దని జిల్లా ఉన్నతాధికారులు సూచించారు. అంతేకాకుండా జిల్లాలో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న వాగులు, చెరువుల వద్ద అనుకొని ఘటన లు జరుగకుండా పోలీసు బందోబస్తును ఏర్పా టు చేశారు.
జిల్లాలో కురిసిన భారీ వర్షానికి చెరువులన్నీ అలుగు పారుతున్నాయి. షాద్‌నగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లోని మెజార్టీ చెరువులు నిండుకుండలా మారి అలుగు పోస్తుండగా.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు చెరువులు అలుగు పారుతున్నాయి. అదేవిధంగా షాద్‌నగర్ నియోజకవర్గంలో 75-100 శా తం వరకు 50 చెరువులు నిండగా, చేవెళ్ల నియోజకవర్గంలో మూడు చెరువులు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 25 చెరువులు 75-100 శాతం మేర నిండినట్లు జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
మొయినాబాద్, జూలై 26: హిమాయత్‌సాగర్ జలాశయానికి జీవ నది అయిన ఈసీవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాని కింద ఉన్న పంటలు జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ వాగులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈసీ వాగు మండలంలోని నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్, అమ్డాపూర్, శ్రీరాంనగర్, నాగిరెడ్డిగూడ, బాకారం గ్రామాల పొలాల నుంచి ప్రవహిస్తున్నది. వెంకటాపూర్ గ్రామ సమీపంలో ఉన్న ఈసీ వాగు వం తెన వద్ద వరద నీరు వంతెనను తాకి వెళ్తున్నది. వంతెన వద్ద 60 అడుగుల ఎత్తులో నీటి ప్రవాహం ఉన్నది. అదే విధంగా అమ్డాపూర్ వంతెన వద్ద 50 అడుగుల ఎత్తులో నీటి ప్రవాహం కొనసాగుతున్నది. మూసీవాగు కూడా భారీగా ప్రవహిస్తున్నది. ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మండలంలో దాదాపుగా 500 ఎకరాల వరకు పంటలు జలమయమయ్యాయి. వాగు ప్రవాహాన్ని చూసేందుకు ప్రజలు అధికంగా తరలివస్తున్నారు.
జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో వర్షం దంచికొట్టింది. చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల్లో, షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్‌నగర్, నందిగామ, కేశంపేట, కొత్తూరు మండలాల్లో మంగళవారం ఉద యం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. చేవెళ్ల మండలంలోని కందవాడలో 13 సెంటీమీటర్లు, షాబాద్ మండలంలోని షాబాద్‌లో 12.1 సెం.మీ, తాళ్లపల్లిలో 9.7 సెం.మీ, చందన్వెల్లిలో 9.1 సెం.మీ, చౌదరిగూడెం మండలంలోని కాసులబాద్‌లో 6.8 సెం.మీ, ఫరూఖ్‌నగర్ మండలంలోని మొగిలిగిద్దలో 5.7 సెం.మీ, శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్లో 5.7 సెం.మీ, మొయినాబాద్ మండలంలోని రెడ్డిపల్లిలో 5.6 సెం.మీ, మొయినాబాద్‌లో 5.5 సెం.మీ, కొందుర్గు మండలంలోని కొందుర్గులో 5.2 సెం.మీ, కొత్తూరు మండలంలోని కొత్తూరులో 5.1 సెం.మీ, చేవెళ్ల మండలం లోని ధర్మసాగర్లో 5 సెం.మీ, నందిగామ మండలంలోని నందిగామలో 4.9 సెం.మీ, మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లిలో 4.6 సెం.మీ, ఫరూఖ్‌నగర్ మండలంలోని షాద్‌నగర్‌లో 4.5 సెం.మీ, శంకర్పల్లి మండ లంలోని శంకర్‌పల్లిలో 4.4 సెం.మీ, మహేశ్వరం మండలంలోని అమీర్‌పేట్‌లో 4.1 సెం.మీ, ఇబ్రహీంపట్నంలో 3.4 సెం.మీ, రా జేంద్రనగర్ మండలంలోని రాజేంద్రనగర్‌లో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.