కొన్ని సాంకేతిక విధానాలతో ఫోయిన ఫోన్ ఆచూకీతో పాటు సమాచారాన్ని పదిలం చేయవచ్చు. గూగుల్ లేదా కేంద్ర ప్రభుత్వ టెలీ కమ్యూనికేషన్ సిస్టంతో ఇది సాధ్యమవుతుంది. పోగుట్టుకున్న స్మార్ట్ ఫోన్లో బ్యాంకు ఖాతా నంబరు, పాస్వర్డులు తదితర సమాచారం ఇతరుల చేతికి చిక్కి దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం టెలికాం శాఖ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పేరుతో ఇంటర్నెట్లో www.ceir.gov.in అనే వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీంతో మనం పోగొట్టుకున్న స్మార్ట్ ఫోన్‌ను ఎవరూ ఉపయోగించకుండా ఏ నెట్‌వర్క్‌లతో పని చేయకుండా టెలికాం వ్యవస్థ చూసుకుంటుంది. దొంగతనానికి గురైన అన్ని స్మార్ట్ ఫోన్లను పనిచేయకుండా చేసేలా ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం చేపట్టింది. దీంతో దొంగతనాలను చెక్ పెట్టవచ్చు
కొమురవెల్లి, జూలై 2: నేటి జీవన విధానంలో సెల్‌ఫోన్ లేని మనిషి లేడనే చెప్పాలి. నచ్చిన సెల్‌ఫోన్ కొనుగోలుకు ఎన్ని వేలు ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదు. అలా కొన్న ఫోన్ ఎక్కడైనా మరిచిపోయినా.. పడేసుకున్నా.. ఎవరైనా దొంగిలించినా.. ఆ సమయంలో పడే బాధ చెప్పలేనిది. పైసల సంగతి పక్కన పెడితే, మనకు సంబంధించిన విలువైన సమాచారం అంతా ఈ స్మార్ట్ ఫోన్లో ఉండడం వల్ల జరిగే పరిణామాల పరిస్థితి ఊహించలేం. ఈ సమాచారాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తారేమో అన్న దిగులుతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం.
ఇలా కాకుండా పోయిన ఫోన్ మనకు దొరకనప్పుడు మన విలువైన సమాచారం ఇతరుల చేతికి చిక్కకూడదు అనుకుంటే చివరి ఆప్షన్‌గా ఎరేజ్ డివైజ్ ద్వారా పోయిన ఫోన్లోని మొత్తం సమాచారాన్ని మనం ఉన్న వద్ద నుంచే శాశ్వతంగా తొలిగించవచ్చు. అయితే అలా చేసిన తర్వాత మన ఫోన్ ఎక్కడుందో తెలుసుకునే అవకాశం కోల్పోవాల్సి వస్తుంది. ఇవన్నీ జరగాలంటే పోయిన ఫోన్లో లొకేషన్ ఆన్ ఉండటంతో పాటు ఇంటర్నెట్ అనుసంధానమై ఉండటమే గాక ఫైండ్ మై ఫోన్ అనే ఆప్షన్ ఆన్ చేసి ఉండాలి