వెల్దుర్తి/ పెద్దశంకరంపేట/ కొల్చారం/ కొల్చారం/ రామా యంపేట, జూలై 2 : మాసాయిపేట మండలంలోని 44వ జాతీయ రహదారిపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావే శాల కు వ్యతిరేకంగా శనివారం సడక్ బంద్ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి మోసగించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను మాదిగ నేతలు బహిష్కరించాలని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు యాదగిరి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు ఎమ్మార్పీఎస్ నాయకులను అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అరెస్ట్‌లతో ఉద్యమాలను ఆపలేరని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాందేడ్ దుర్గయ్య అన్నారు. పెద్దశంకరంపేట మండలంలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ సడక్‌బంద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రుమాల సాయిలు, నాగరాజు,కిషన్, మహేశ్, శంకరయ్య, ఆశయ్య పాల్గొన్నారు. వీరిని పెద్దశంకరంపేట పోలీసులు అరెస్టు చేశారు.
28 ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికిన బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగలకు మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్ర ప్రభాకర్ మాదిగ అన్నారు. ఆత్మగౌర వం ఉన్న మాదిగ నాయకులు బీజేపీ సభకు వెళ్లొద్దని సూచించారు. ఎమ్మార్పీఎస్ నాయకులను కొల్చారం పొలీసు లు ముందస్తుగా అరెస్టు చేశారు. మాదిగలకు ద్రోహం చేసిన బీజేపీ నాయకులకు తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్‌గారి కృష్ణ, నాయకులు బండరిగల్ల దుర్గయ్య, ఎంఎస్ఎఫ్ మండలాధ్యక్షుడు మహేశ్, నేతలు నవీన్, కృష్ణ పాల్గొన్నారు.
వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్త్తామని హామీ ఇచ్చిన బీజేపీ నాయకులు తెలంగాణకు రావొద్దని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్యాల కిషన్, సీనియర్ నేత పాతూరి రాజు డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులను హైదరాబాద్‌కు వెళ్లకుండా అడ్డుకుంటారని పోలీసులు అరెస్టు చేశారు.
– ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాకర్