చేవెళ్ల బస్టాండ్ పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.మూడు కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్శంగా శుక్రవారం చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి బస్టాండ్ ఆవరణలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేవెళ్ల బస్టాండ్‌ను పునర్నిర్మించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మంత్రి కేటీఆర్‌కు విన్నవించినట్లు పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన హెచ్ఎండీఏ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.
చేవెళ్లటౌన్, జూలై 1: చేవెళ్ల బస్టాండ్ పునర్నిర్మాణానికి రూ. మూడు కోట్ల నిధులు మంజూరైనట్లు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన చేవెళ్ల మం డల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో పర్యటించి, ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్, ఫూలే, బాబూ జగ్జీవన్‌రావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆర్టీసీ డిపోలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
చేవెళ్ల బస్టాండ్ పునర్నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి పలుసార్లు చర్చించినట్లు గుర్తుచేశారు. బస్టాండ్ అభివృద్ధి కోసం రూ.మూడు కోట్ల నిధులను హెచ్ఎండీఏ నుంచి మంజూరు చేయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు చేవెళ్ల ప్రాంత ప్రజల పక్షాన ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. బస్టాండ్ ఆవరణలో కమర్షియల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసి అన్ని వసతులను కల్పిద్దామని, తెలంగాణలోనే గ్రీన్ బస్టాండ్‌గా, స్వచ్ఛ బస్టాండ్‌గా మార్చుకుందన్నారు.
కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, వైస్ చైర్మన్ శివప్రసాద్, జడ్పీటీసీ మాలతీకృష్ణారెడ్డి, ప్రభాకర్, చింటు, మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, చేవెళ్ల నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, సర్పంచ్‌లు మోహన్‌రెడ్డి, మల్లారెడ్డి, నర్సింహులు, శివారెడ్డి, శ్రీనివాస్, ఎర్ర మల్లేశ్, రవీందర్‌రెడ్డి, నర్సింహులు, వెంకటేశ్, రవీవిందర్, యాదయ్య, శ్రీను, నరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.