ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 30 : రోగుల ప్రాణాలను కాపాడటంతో వైద్యుల కృషి అజరామరం. అనుక్షణం ఆరోగ్యాన్ని, శారీరక, మానసిక స్థెర్యాన్ని అందించే మానవరూపంలోని దేవుళ్లు వైద్యులు. ఊపిరిపోసిన ప్రాణదాతలు ప్రాణం ఉన్నంత వరకు గుర్తుండిపోతారు. దేవుడితో సమానమైన వైద్యుడికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఓ రోజుంది. అదే డాక్టర్స్డే ప్రతి వృత్తి దేనికదే సాటి అయినప్పటికీ వైద్య వృత్తి నాటికి భిన్నమైంది. మృత్యువు చివరి అంచులదాకా వెళ్లినప్పటికీ నిరంతరం వారికి ప్రాణంపోసే శక్తి ఈ వృత్తికి ఉంటుంది. అందుకే వైద్యవృత్తి పవిత్రమైనది.
తమ వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి తెల్లకోటుకే ప్రాధాన్యమిస్తారు. ఎదుటివ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు తపన పడేవాడే నిజమైన వైద్యుడు. మానవసేవే, మాధవసేవ అన్నట్లు సాగే వైద్యవృత్తిలో ఎంతగా సేవానిరతి కలిగి ఉంటే అంతటి గొప్పవ్యక్తిగా గుర్తింపు డాక్టర్లకు సహనం, ఓర్పు, సేవానిరతి, దయ ఉండాలి. ఏ అత్యవసర పరిస్థితినైనా తనకు వైద్యం చేసే డాక్టర్ అందుబాటులో ఉన్నాడన్న, ఉంటాడన్న నమ్మకం రోగికి కలిగేటట్లు వైద్యులుగా మెలగాలి. వృత్తిమీద వైద్యులకు అభిరుచి, నమ్మకం ఉండాలి. ఏదో జీవనోపాధికోసం పనిచేయకుండా తాను చేస్తున్న పని ఒక క్రమబద్ధతగా ఉండాలి. నిర్ధిష్టమైన టైంటేబుల్ ఉండాలి. ప్రతి డాక్టరు ఎల్లప్పుడూ రోగికి మంచి చేయాలనే ఆలోచిస్తారు. ఫీజు తీసుకున్నా, తీసుకోకపోయినా తను చేసేసేవ ఒకేలా ఉంటుంది. రోగికి వైద్యుడికి మధ్య నమ్మకం అనేబంధం కలిగి ఉండాలి.
అనుక్షణం ఆరోగ్యాన్ని శారీరక, మానసిక ైస్థెర్యాన్ని అందించే ఈ వైద్య నారాయణులకు అందరూ రుణపడి ఉంటారు. డాక్టర్స్ అంటే చికిత్స చేసేవాడని రోగి ఫీజు చెల్లించాడనుకుంటే ఆ ప్రాణదాత రుణం తీరిపోదు. అందుకే ఈ వైద్యులకు కోసం ప్రపంచమంతా ఒక్కరోజు కేటాయించింది. అదే ప్రపంచ డాక్టర్స్డే, వాళ్లను గుర్తుపెట్టుకుని ఈ రోజున డాక్టర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు.
1993 మార్చి 30న జార్జియాలోని విండార్లో తొలిసారిగా డాక్టర్స్డే పాటించారు. చార్లెస్ బి అల్కండ్ భార్య బ్రౌన్ అల్కండ్ వైద్యుల గౌరవార్థం ఒక్కచోట ఒక్కరోజు కేటాయించాలని నిర్ణయించారు. గ్రీటింగ్ కార్డులను పంపడం, అసువులు బాసిన వైద్యులకు పూలతో నివాళుర్పించడం ద్వారా తొలి డాక్టర్స్డే ఉత్సవం జరిపారు. జాతీయ డాక్టర్స్డే రోజున ఎర్రని కార్నేషన్ పువ్వులను సాధారణంగా వాడేవారు. యునైటెడ్ స్టేట్స్లో ప్రతినిధుల సభలో డాక్టర్స్డే పాటించాల్సిందిగా ప్రవేశపెట్టారు. 1990అక్టోబర్ 30న అధ్యక్షుడు జూర్జిలుఫ్ మార్చి 30న నేషనల్ డాక్టర్స్డేగా పేర్కొంటూ చట్టంపై సంతకం చేశారు. మనదేశంలో ప్రతియేటా జూలై 1న డాక్టర్స్డేగా జరుపుకొంటున్నాం. ప్రముఖ వైద్యుడు బీసీరాయ్కు గౌరవార్థం ఈ రోజును నిర్ణయించారు. ఈయన 1882 జూలై 1న జన్మించారు. మన దేశంలో వైద్యారంగానికి ఎనలేని సేవలించిన బీసీరాయ్ గౌరవార్థం ఆయన జయంతిని డాక్టర్స్డే పాటిస్తున్నారు. డాక్టర్ బీసీరాయ్ పుట్టినరోజు, మరణించిన రోజు జూలై ఒకటోతేదీ కావటం విశేషం. ఆయన 1962 జూలై 1వ తేదీన మరణించారు. ఆయన వర్ధంతి, జయంతిల సందర్భంగా ప్రతియేటా డాక్టర్స్డేను నిర్వహిస్తున్నారు.
దేశంలో ఎంతో మహోన్నతమైన డాక్టర్ బీసీరాయ్ జయంతిని పురస్కరించుకుని డాక్టర్స్డేను నిర్వహించుకుంటాం. ముఖ్యంగా వైద్యుడనేవాడు, ప్రజలకు నమ్మకంతో పనిచేయాలి. వైద్యుడిని నమ్ముకుని వచ్చిన రోగులకు న్యాయంచేసే విధంగా పనిచేయాలి. నాడు చేసే వైద్యోనారాయణోహరి అనే నానుడిని నేడు కార్పొరేట్ దవాఖానలు పూర్తిగా డబ్బులకు ఆశపడి మరిచిపోతున్నాయి. వైద్యుడు డబ్బులను చూడకుండా ప్రజలకు న్యాయం చేయాలి. నేటి వైద్యరంగంలో రావాలనుకునే యువత ముందుగా ముఖ్యంగా ఎథికల్ ప్రాక్టీస్ చేయాలి, అలాగే, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో మాతా, శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్యులు ముఖ్యంగా మాతాశిశు మరణాలు జరగకుండా ఆపగలిగితే మన దేశం మరింత అభివృద్ధిలో ముందుంటుంది.
– వైద్యాధికారి, అభిరాం