తాండూరు, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మంగళవారం తాండూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఉల్లాసంగా… ఉత్సాహంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో యోగా డే కార్యక్రమం నిర్వ హించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజా సం ఘాల నేతలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మా ట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు యోగ ఔషధంలా పని చేస్తుందన్నారు. యోగాసనాలు చేస్తే సర్వరోగాలు దూరం అవుతాయని సూచించారు.
పరిగి టౌన్, జూన్ 21 : పరిగిలో సాయిధ్యాన మందిరం దగ్గర యోగాసనాలు చేశారు. యోగా గురువు కిష్టయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సై విఠల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలన్నారు. యోగా చేస్తే ఆరోగ్యం బాగుం టుందని చెప్పారు. కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.
వికారాబాద్, జూన్ 21 : ప్రతిరోజు యోగా చేస్తే మంచి ఆరోగ్యంగా ఉంటామని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల పేర్కొన్నారు. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిబిరంలో ఆమె పాల్గొన్నారు. కార్య క్రమంలో యోగా గురువులు బాల కృష్ణ, నారాయణరాథోడ్, ఆలయ ధర్మకర్తల మండలి పెద్దలు, యోగా సాధకులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కోర్టులో యోగా దినోత్సవం జరుపుకున్నారు. జిల్లా ప్రిన్సిపల్ న్యాయమూర్తి సుదర్శన్, సీనియర్ సివిల్ జడ్జి న్యాయ మూర్తి శంకరి శ్రీదేవి, ప్రిన్సిపల్ న్యాయమూర్తి శ్రీకాంత్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి శృతిదూత, వికారాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దుద్యాల లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి జగన్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ రాజశేఖర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యా యవాదులు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో యోగా దినోత్సవం జరుపుకున్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డాక్టర్ గాయత్రీ, కో ఇన్చార్జి సీనియర్ వైద్యులు వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపాల్ జయదేవ్, వైస్ ప్రిన్సిపల్ శివారెడ్డి, రవీం దర్‌రెడ్డి, ఆయూష్ వైద్యులు, జిల్లా స్టోర్ అధికారులు తదితరతులు పాల్గొన్నారు.
బొంరాస్‌పేట, జూన్ 21 : మండలంలోని దుద్యాల, బాపల్లితండా తదితర పాఠశాలల్లో హెచ్ఎంలు నెహ్రూచౌహాన్, గోపాల్, విద్యార్థులు యోగాసనాలు వేశారు. నిత్య జీవి తంలో యోగ యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. దుద్యాలలోని పతంజలి యోగాశ్రమంలో బాల్‌రాజ్ స్వామి, విద్యార్థులు తదితరులు యోగాసనాలు వేశారు. ప్రతి రోజూ యోగాసనాలు వేయడం వల్ల ఒత్తిడిని జయించ వచ్చని, రోగాలకు దూరంగా ఉండవచ్చని స్వామి యోగానంద అన్నారు. నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆశ్రమ ట్రస్టు అధ్యక్షుడు మర్రి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ఆర్యా, గోవింద్రావు, టంకు మురళి, శ్యామలయ్యగౌడ్ పాల్గొన్నారు.
పెద్దేముల్, జూన్ 21: విద్యార్థులు యోగాను అలవాటు చేసుకోవాలని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతప్ప అన్నారు. మంగళవారం మం డల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో విద్యా ర్థులతో యోగాసనాలు, మెడిటేషన్ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యా యులు, సిబ్బంది పాల్గొన్నారు.
కులకచర్ల, జూన్ 21: కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గిరిజన గురుకుల పాఠశాల ఆవరణలో పతంజలలియోగా సమితి మండల కన్వీనర్ రమేశ్, ప్రిన్సిపాల్ గంగారాం ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఐ గిరి, మైపాల్, ఘనాపూరం వెంకటయ్యగౌడ్, ఎల్లయ్య, రాఘవేంద్రాచారి, రామకృష్ణ, శేఖర్, రవిచందర్, తదితరులు పాల్గొన్నారు. బండవెల్కిచర్ల న్యూరవీంద్రభారతి పాఠశాలలో యోగాదినోత్సవాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు నిర్వహించారు.
నవాబుపేట,జూన్21: యోగాతో జ్ఞాపకశక్తిని పెంచుకుని చదువులో రాణించాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచించారు. మండలం పరిధిలోని పలు గ్రామాల్లో గల పాఠశాలల్లో యోగాసానాలతో పాటు కొన్ని సూచనలు చేశారు. నవాబుపేట, చించల్‌పేట, పులిమామిడి గ్రామాల్లో విద్యార్థులకు టీచర్లు ధ్యాన పాఠాలను చెప్పారు. ఈ సందర్భంగా పులిమామిడి గ్రామ జడ్పీ పాఠశాల హెచ్ఎం మోకీలా అంజయ్య మాట్లాడుతూ ప్రతి రోజూ యోగ చేయడం ద్వారా ఎలాంటి వ్యాధులు దరిచేరవన్నారు.కార్యక్రమంలో ఉపా ధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, పాఠశాల చైర్మన్లు పాల్గొన్నారు.