కేశంపేట : టీఆర్ఎస్తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండల కేంద్రంలో 6 లక్షల ఎన్ఆర్ఈజీఎస్, మండల పరిషత్ సాధారణ నిధులతో నూతనంగా నిర్మించ తలపెట్టిన సీసీరోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. గాంధీజీ 74వ వర్ధంతి సందర్భంగా కేశంపేటలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. రాష్ట్రాభిద్ధే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని, నిరుపేదల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఆయా వర్గాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. గ్రామాల్లో ప్రజలకు సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం అధిక నిధులను ఖర్చు చేస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌లు వెంకట్‌రెడ్డి, నవీన్‌కుమార్, రాములునాయక్, కృష్ణయ్య, ఎంపీటీసీ యాదయ్యచారి, జడ్పీటీసీ విశాల, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్‌గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, మండల కో-ఆప్షన్ మెంబర్ జమాల్‌ఖాన్, మాజీ ఎంపీపీ విశ్వనాథం, టీఆర్ఎస్ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, నాయకులు శ్రావణ్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బాల్‌రాజ్‌గౌడ్, వేణుగోపాలాచారి, పర్వత్‌రెడ్డి, వెంకటయ్యతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.