రంగారెడ్డి, జూలై 15(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బదిలీలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ జిల్లా అధికారులతో బదిలీల ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ప్రతి కేడర్లోనూ 40 శాతానికి మించకుండా బదిలీల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.