ఓటరు జాబితా సవరణనుపకడ్బందీగా చేపట్టాలి
ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిం చారు.
- రంగారెడ్డి కలెక్టర్ శశాంక
- సమావేశంలో మాట్లాడుతున్న రంగారెడ్డి కలెక్టర్ శశాంక
ఇబ్రహీంపట్నం, జనవరి 18 : ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పెషల్ సమ్మరి రివిజన్లో భాగంగా ఈనెల 6న ఓటరు జాబితా ప్రచురితం కాగా అభ్యంతరాల కోసం ఈ నెల 22 వరకు అవకాశముందన్నారు. నకిలీ, చనిపోయిన వారి పేర్లను తొలగించి అర్హులైన వారిని ఓటరు జాబితాలో నమోదు చేయించాలన్నారు.
ఓటరు జా బితా సవరణపై రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. రాజకీయ పార్టీలు బూత్‌స్థాయిలో ఏజెంట్లను నియమించుకుని.. ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థా యిలో పరిశీలించుకోవాలని సూచించారు. 1450పైచిలుకు ఓట ర్లు కలిగిన చోట కొత్త పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గం వారీగా ప్రతివారం పొలిటికల్ లీడర్లతో మీటింగ్ నిర్వహించి అన్ని విషయాలను వెల్లడిస్తామన్నారు.
ఈనెల 20, 21 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ క్యాంపెయిన్లను నిర్వహిస్తామని..అక్కడ ఓటరు జాబితాతోపాటు బీఎల్వోలు అందుబాటులో ఉంటారన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్క రూ తమ ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడు తూ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికలు కూడా సక్సెస్ అయ్యేలా రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సంగీత, ఎన్నికల విభాగం అధికారులు, పలు పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

