ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు అండగా నిలుస్తోందని సర్పంచ్ శివరాల జ్యోతిరాజు అన్నారు. మండల పరిధిలోని ముకునూరు గ్రామానికి చెందిన కంబాలపల్లి లక్ష్మారెడ్డి అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించుకోగా సుమారు లక్ష వరకు ఖర్చయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సహకారంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి లక్ష్మారెడ్డికి రూ. 42వేలు మంజూరయ్యాయి.
అట్టి చెక్కును సోమవారం సర్పంచ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాధితుడికి అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజల్లో సంతోషాన్ని నింపుతుందని సర్పంచ్ అన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కృష్ణ, వార్డుసభ్యులు పాల్గొన్నారు.