హయత్‌నగర్ రూరల్ : అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని విజయవాడ హైవేపై బైక్‌ను లారీ ఢీకొట్టగా బీటెక్ విద్యార్థి దుర్మరణం చెందాడు. సిరిసిల్ల జిల్లా ప్రగతినగర్‌కు చెందిన పులి ప్రణయ్‌కుమార్ (21) హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ చింతలకుంటలో ఉంటూ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం కాలేజీ నుంచి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఎన్‌హెచ్ 65 రోడ్ మీదకు రాగానే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు సీకుల లోడ్‌తో వెళ్తున్న లారీ.. బైక్‌ను వేగంగా ఢీకొట్టింది.
ప్రణయ్‌కుమార్ అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. లారీ డ్రైవర్ అతివేగంగా కొద్ది దూరం వెళ్లి ఓ ఆలయ ప్రహరీని ఢీకొట్టాడు. లారీ డైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ స్వామి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.