చేవెళ్లటౌన్ : చేవెళ్ల మండల పరిధిలోని గొల్లగూడ గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజను ఘనంగా నిర్వహించారు. అయ్యప్పస్వామి నామ స్మరణతో పడిపూజ ప్రాంగణం మార్మోగింది. ముఖ్యంగా స్వాములు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. పడిపూజ కార్యకమానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యకమంలో గ్రామ సర్పంచ్ రామచంద్రయ్య, ఉప సర్పంచ్ విఠలయ్యగౌడ్, గురు స్వాములు నర్సింలు, వెంకటేష్, అంజయ్యగౌడ్, టీఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షుడు మన్మోహన్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.