e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home రంగారెడ్డి రుచికన్నా.. ఇమ్యూనిటీ మిన్న!

రుచికన్నా.. ఇమ్యూనిటీ మిన్న!

రుచికన్నా.. ఇమ్యూనిటీ మిన్న!

కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలంటే .. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అందుకు అనుగుణంగా పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఇమ్యూనిటీని పటిష్ఠంగా ఉంచుకునేందుకు నగరవాసులు తమ ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పు చేసుకుంటున్నారు. నోటి రుచులకు ప్రాధాన్యత తగ్గించి.. ఆరోగ్యానిచ్చే వంటకాలకు జై కొడుతున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టుగానే కస్టమర్ల కోసం నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు ప్రొటీన్‌, ఐరన్‌, ఫైబర్‌ ఫుడ్‌లను మెనూలో చేరుస్తున్నాయి. బలాన్నిచ్చే వంటకాలను సరఫరా చేస్తున్నాయి. తాజా కూరగాయలు, మాంసం, కోడిగుడ్లు, పాలపదార్థాలతో తయారు చేసిన వివిధ రకాల వంటకాలను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇమ్యూనిటీ పెంచే డిషెస్‌ అంటూ.. కొన్ని హోటళ్లు, హోం కిచెన్స్‌ సంస్థలు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. కాల్‌ చేస్తే కరోనా జాగ్రత్తలతో హోం డెలివరీ చేస్తున్నాయి.

నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాం..
నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాం. అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. లంచ్‌, డిన్నర్‌ సరఫరా చేస్తాం. 5కిలో మీటర్ల లోపు ఉచితంగా డెలివరీ చేస్తున్నాం. ఇంటి ఫుడ్‌ తినాలనుకునే వారికి అనేక కిచెన్స్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. కొవిడ్‌ కష్టకాలంలో చాలా మంది మంచి ఆహారం లభించక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి హోం ఫుడ్‌ అందించే సేవలు బాగా ఉపయోగపడుతాయి. మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. – రష్మీ, చెఫ్‌ జాలీ.

తక్కువ ధరకే..
హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు హోం కిచెన్స్‌ పేరుతో ఆహారాన్ని అందించే సంస్థలు కూడా కొవిడ్‌ను కట్టడి చేసే ఇమ్యూనిటీ ఫుడ్‌పైనే దృష్టి సారించాయి. పలు హోం కిచెన్‌లు ప్రస్తుతం చాలా బిజీగా మారాయి. ముఖ్యంగా అల్లం, పసుపు, తాజా కూరగాయలు, పండ్లు, బ్లూబెర్రీస్‌, చికెన్‌, వెజిటేబుల్‌ సూప్‌ ఇలా ప్రొటీన్‌ అందించే వంటకాలను ఇంట్లోనే తయారు చేసి.. ప్యాకేజీల వారీగా కొవిడ్‌ పేషెంట్లకు సరఫరా చేస్తున్నాయి. ఈ ఆపత్కాలంలో డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వకుండా తక్కువ ధరల్లో పోషకాహారంతో కూడిన వంటకాలను అందిస్తున్నాయి. ప్రధానంగా ఉడికించిన గుడ్డు, వెజ్‌, టమాటో, కార్న్‌ సూప్‌, బట్టర్‌ మిల్క్‌, లెమన్‌ జ్యూస్‌, పప్పు, సాంబార్‌, ఫ్రూట్‌ సలాడ్‌ తదితర తెలంగాణ, ఆంధ్ర మెనూలు అందుబాటులో ఉన్నాయి.

మీకు నచ్చిన ఆహారం అందించే హోం కిచెన్స్‌ ఇవే..
రెనీ ఫుడ్స్‌ – 9100854558, హోమ్స్‌ కిచెన్‌ -9121006852
మీర హోం ఫుడ్స్‌ -9949836138, మామ్స్‌ కిచెన్‌ -6302194824, సీనియర్‌ కిచెన్‌ -7032829125
ఆర్యాన హౌస్‌ -8639768120, మామ్స్‌ టర్ఫ్‌ -9030012567
చెఫ్‌ జాలీ -9848218309
అరోమ జోన్‌ -9703332793
పూజ కిరసూల్‌ -8073298032
జాన్వి ఫ్లేవర్‌ హోం-6300975328
ప్రశంస ఫుడ్‌ -6300258303
మ్యాజిక్‌ ఆన్‌ టంగ్‌,-8688901987

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రుచికన్నా.. ఇమ్యూనిటీ మిన్న!

ట్రెండింగ్‌

Advertisement