ఇబ్రహీంపట్నం రూరల్, జూలై 9 : గొల్లకురుమలతో పాటు కుల వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో మొదటి విడుతలో మిగిలిపోయిన లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే 42 మంది లబ్ధిదారులకు గొర్రెలు అందజేసి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కులాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో పథకాలను ఎక్కడా నిలిపివేయలేదన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి గొర్రెలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు.
తొట్ల ఏర్పాటుకు రూ.5లక్షలు..
గ్రామంలో మూగజీవాల దాహార్తి తీర్చడానికి తాగునీటి తొట్లు లేక ఇబ్బందులు పడుతున్నామని గొర్రె కాపరులు చెప్పిన వెంటనే ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తొట్ల ఏర్పాటు కోసం రూ.5లక్షలు మంజూరు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఎంపీటీసీలు అచ్చన శ్రీశైలం, జ్యోతి, అనసూయ, దండమైలారం సర్పంచ్ మల్లీశ్వరి, సహకార సంఘం వైస్‌చైర్మన్ ఈశ్వర్, ఉపసర్పంచ్ బాలరాజు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిన మేడిపల్లి ఉపసర్పంచ్
ఇబ్రహీంపట్నం, జులై 9 : రాజకీయాలకతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని, దీంతో వివిధ రాజకీయపార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో యాచారం మండలం మేడపల్లి ఉపసర్పంచ్ ఆలంపల్లి సత్తమ్మ టీఆర్ఎస్ చేరారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి వారికి శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పేదప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, యాచారం జడ్పీటీసీ జంగమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, మేడిపల్లి సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బాష పాల్గొన్నారు.