పరిగి, జూన్ 7: టెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఆమె మద్గుల్చిట్టెంపల్లి డీపీఆర్సీలో టెట్ పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ టెట్ పరీక్షకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే నేరుగా జిల్లా విద్యాశాఖ అధికారి లేదా తనకు ఫోన్ ద్వారా.. మెసే జ్ రూపంలో తెలపాలన్నారు. పరీక్షా కేం ద్రాలను పరిశీలించాలని, లోపలికి సెల్ఫోన్లు, వాచ్లు, ఎలక్ట్రానిక్ సామగ్రికి అనుమతి లేదన్నారు.
పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో 24 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 12వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే మొదటి పేపర్ పరీక్షకు 5,730 మంది అభ్యర్థులు, మధ్యా హ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంట ల వరకు జరిగే రెండోపేపర్కు 3,745 మంది హాజరు కానున్నట్లు కలెక్టర్ తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు నో ఎంట్రీ అని అభ్యర్థులు గమనించి సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నా రు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవి, ఏసీజీఈ ప్రభు, డీసీఈబీ కార్యదర్శి అనంతరెడ్డి, తహసీల్దా ర్లు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.