కులకచర్ల, జూన్ 2: హార్వెస్టర్.. బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన కులకచర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. మండలంలోని కామునిపల్లి గ్రామానికి చెందిన ఎర్రం రాజు(35), శాగంటి నర్సింహులు(55) ఇద్దరు కలిసి శుక్రవారం జరుగనున్న ఎల్లమ్మ తల్లి బోనాల పండుగకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు గురువారం సాయం త్రం బైక్‌పై కులకచర్లకు వచ్చి సామగ్రిని తీసుకుని తిరి గి ఇంటికి వెళ్తుండగా.. కామునిపల్లి-కులకచర్ల గ్రామ శివారులో పరిగి నుంచి కులకచర్లకు వెళ్తున్న హార్వెస్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇరువురు రోడ్డు పడి అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కులకచర్ల ఎస్ఐ గిరి ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని మృ తదేహాలను పరిశీలించారు. హార్వెస్టర్ డ్రైవర్ పరారీలో ఉండగా.. హార్వెస్టర్‌ను పోలీసులు కులకచర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇద్దరి మృతదేహాలను పరిగిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. హార్వెస్టర్‌ను వెలుతురు లేకుండా చీకటిలో నడిపించడంతోనే ఈ ప్రమా దం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు.
కామునిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛా యలు అలుముకున్నాయి. ఆ ఇద్దరు నిరుపేద కుటుంబాలకు చెందిన వారని, కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. ఇరువురి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.