వికారాబాద్, జూన్ 2 : ఉద్యమ ఫలాలను సబ్బండ వర్గాలకు అందిస్తున్న సంక్షేమ స్వరాజ్యం మన తెలంగాణ ప్రభుత్వం అని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. గురువారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి పోరాటాల ఫలితంగానే నేటి స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణే లక్ష్యంగా బాటలు వేస్తు న్నామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, సురేశ్, నవీన్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, గ్రంథాలయ సంస్థ మాజీచైర్మన్ హఫీజ్, మాజీ జడ్పీటీసీ ముత్తహర్‌షరీఫ్, నాయకులు వేణుగోపాల్, లక్ష్మీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నరేశ్, సుభాశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వికారాబాద్ నియోజక వర్గం లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కళాశాలల ముందు చైర్మన్లు, జిల్లా అధికారులు జాతీయ జెండాను ఎగరవేసి సంబురాలు జరుపుకొన్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో..
కొడంగల్, జూన్ 2 : నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అధికారులతో పాటు టీఆర్ఎస్ నాయకులు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. శ్రీ బాలాజీ కేసీ ఉన్నత పాఠశాలలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సురేశ్‌కుమార్, పోలీస్‌స్టేషన్‌లో సీఐ, ఎంపీపీ కార్యాలయంలో వైస్ ఎంపీపీ, మార్కెట్ యార్డులో వైస్ చైర్మన్ భీములు జాతీయ జెండాను ఆవి ష్కరించి గాంధీజీకి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు నివాళులు అర్పిం చారు. తెలంగాణ ఆవిర్భవానికి ప్రాణాలొడ్డిన త్యాగధనులను స్మరించుకున్నారు.
పరిగి నియోజకవర్గంలో..
పరిగి, జూన్ 2: పరిగి డివిజన్ పరిధిలోని పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు, చౌడాపూర్ మండలాల్లో గురువారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. రంగురంగు కాగితాలతో కార్యాలయాలను సుందరంగా అలంకరిం చారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీలు కె.అరవిందరావు, అనసూజ, మల్లేశం, సత్యమ్మ, జడ్పీటీసీలు హరిప్రియ, మేఘమాల, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ. సురేం దర్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజల సంఘటిత పోరాటంతో…
తాండూరు, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబురాలు తాండూరు నియోజకవర్గంలో అంబరాన్నంటాయి. గురువారం తాండూరు రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, పలు సేవా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల వారు జాతీయ పతాకాన్ని ఎగరవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. మున్సి పల్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ విఠల్‌నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో అశోక్‌కుమార్ జాతీయపతాకాన్ని ఎగరవేశారు. మండల పరిషత్‌లో, గ్రామ పంచాయతీల్లో ప్రజా ప్రతినిధులు, అధికా రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు అధికారులు మాట్లాడుతూ అమరుల త్యాగం, తెలంగాణ ప్రజల సంఘటిత పోరాటంతో 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందన్నారు.