ఇబ్రహీంపట్నం, జూన్ 2 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇకనుంచి కల్యాణలక్ష్మి చెక్కులను ఇంటింటికీ తిరిగి అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఢిల్లీస్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతుం డటంతో ఇబ్రహీంపట్నం ముందంజలో ఉండటం సంతోషకరమన్నారు. ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా రూ. 50 కోట్లు అందజేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గం ఐటీ, పారిశ్రామిక, ఫార్మారంగాలతో పాటు ఉన్నతమైన రక్షణరంగ సంస్థలకు నిలయంగా మారిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, వైస్‌ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు కప్పరి స్రవంతి, కొత్త ఆర్తిక, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్లు బిట్ల వెంకట్‌రెడ్డి, మంచిరెడ్డి మహేందర్‌రెడ్డి, తాసిల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో క్రాంతికిరణ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెద్దఅంబర్‌పేట : 22వ వార్డు కుంట్లూరు 99 సర్వేనంబర్‌లో రెండెకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ హరిశంకర్‌తో కలిసి అక్కడున్న మహిళలు, పిల్లలతో కాసేపు మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని, అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. క్రీడా స్థలం మీది అని.. దాని సంరక్షణ కూడా మీదే అని స్థానికులకు సూచించారు. అంతకుముందు క్రీడా ప్రాంగణంలో వాలీబాల్ ఆడారు. అనంతరం మహిళా స్వశక్తి భవన ప్రహరీని ప్రారంభించారు. ఇక్కడి భూమిని ప్రభుత్వం దక్కించుకున్నదని, రెండు ఎకరాల్లో గ్రౌండ్ చేశారని, ఈ భూమి విలువ ఇంచుమించు రూ.15 కోట్లు ఉంటుందని, దీన్ని సర్కారే ప్రజలకు అంకితం చేసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న, వైస్ చైర్పర్సన్ చామ సంపూర్ణారెడ్డి, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, అర్చన, విద్యావతి, పరశురాంనాయక్, కోటేశ్వర్రావు, రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీరాములు, కమిషనర్ రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.