తాండూరు రూరల్, మే 5: ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి, రైతులను ఆదుకుంటుందని ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గోనూర్, గౌతాపూర్లోని మారుతి హైస్కూల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతును ఆదుకోవడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలను రైతుల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారన్నారు. 24 గంటల విద్యుత్, రైతు బీమా, రైతుబంధు, విత్తనాలు, ఎరువులు సమయానికి అందిస్తున్నారన్నారు. రైతుల కోసం రైతు వేదికలను మండలంలో 7 చోట్ల నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రవీందర్‌గౌడ్, రైతు బంధు సమితీ కన్వీనర్ రామలింగారెడ్డి పాల్గొన్నారు.
తొర్రూర్‌లో…
తుర్కయాంజాల్, మే 5 : తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూర్ గ్రామంలో బుధవారం జిల్లా సహకార మార్కెటింగ్ శాఖ (డీసీఎంఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రంగారెడ్డి జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డితో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 9 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి లబ్ధిపొందాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మేనేజర్ పాండురంగంగౌడ్, ఇబ్రహీంపట్నం ఏడీఏ సత్యనారాయణ, ఏవో సల్మాన్నాయక్, ఏఈవోలు లక్ష్మణ్, కల్యాణి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కందాడ ముత్యంరెడ్డి, తుర్కయాంజాల్ రైతు సేవా సహకార సంఘం వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, డైరెక్టర్ సామ సంజీవరెడ్డి పాల్గొన్నారు.
గాజీపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో..
పెద్దేముల్ : గాజీపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. దళారులను నమ్మొద్దని, కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చి గిట్టుబాటు ధరను పొందాలన్నారు.
కొనుగోళ్లలో అలసత్వం వహించొద్దు
యాలాల, మే 5 : ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వహించొద్దని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం యాలాల మండలంలోని రాస్నం, బెన్నూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం యాలాల మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, తాండూరు వ్యవసాయ మార్కట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీగౌడ్, వైస్ ఎంపీపీ రమేశ్, జిల్లా కో ఆప్షన్ అధ్యక్షుడు అక్బర్ బాబా, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ గోవిందమ్మ పాల్గొన్నారు.