ధారూరు, ఏప్రిల్ 5: సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న హరిత హారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. ఈ కార్యక్రమం కింద అన్ని గ్రామాల్లోనూ నర్సరీలను ఏర్పాటు చేసి అందులో మొక్కలను రానున్న హరితహారం కార్యక్రమంలో నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. నర్సరీల్లో ఏర్పాటు చేసిన మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు గ్రీన్నెట్ షెడ్లతో రక్ష ణ కల్పిస్తున్నారు. రానున్న జూన్ నాటికి 5.2 లక్షల మొక్కలను పెంచే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. మండలంలోని 32 గ్రా మ పంచాయతీలు…అల్లాపూర్, అల్లీపూర్, అంతారం, అంపల్లి, చింతకుం ట, ధర్మాపూర్, ధారూరు, స్టేషన్ధారూరు, దోర్నాల్, ఎబ్బనూర్, గట్టేపల్లి, గురుదొట్ల, హరిదాస్పల్లి, కెరెళ్లి, కొండాపూర్కలాన్, కుక్కింద, కుమ్మరిపల్లి, మైలారం, మోమిన్కలాన్, మోమిన్ఖుర్దు, మున్నూర్సోమారం, నాగారం, నాగసముందర్, నాగుసాన్పల్లి, నర్సాపూర్, అవుసుపల్లి, పులిచింతల మడుగుతండా, రాజాపూర్, రాంపూర్తండా, రుద్రారం, గడ్డమీదిగంగా రం, తరిగోపుల గ్రామ పంచాయతీల పరిధిల్లోని నర్సరీల్లో 17 వేల చొప్పున మొక్కలను(టేకు, మునగ, నీలగిరి, జామ, ఈత, వేప, ఉసిరి, బాదం, చైనా బాదం, కానుగ, అల్లనేరేడు, చింత శ్రీగంధం, జమ్మీ, కుంకుడు, మర్రి తదితర మొక్కలు)పెంచుతున్నారు.