షాద్‌నగర్ టౌన్, మే 27: అన్ని దవాఖానల్లో సిజేరియన్లను తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి సూచించారు. పట్టణంలోని మం డల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం డివిజన్ వైద్యారోగ్యశాఖ సమీక్షా సమావేశాన్ని ఆమె నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ సూచనల ప్రకారం అన్ని దవాఖానల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, గర్భిణులకు పరీక్షలు నిర్వహించిన తర్వాత అవసరం లేకున్నా ఏదైనా దవాఖానలో సిజేరియన్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు ప్రసవాలకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలని, ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీ అయిన మహిళలకు కేసీఆర్ కిట్లు ఇవ్వడంతోపా టు వారివివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.
ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగేలా చూడాలన్నారు. గర్భిణులు, చిన్నారులకు క్రమం తప్పకుండా ఇంజెక్షన్లు ఇప్పించాలన్నారు. గర్భవతులను గుర్తించిన వెంటనే మూ డు నెలల్లోగా వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేయాలని, పీహెచ్‌సీల్లోని ల్యాబ్‌ల్లో వారికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల్లో జూన్ మొదటి వారంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అం దువల్ల వైద్యులు, సిబ్బంది ఉదయం 9నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ విధులను నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు వైద్యాధికారులు మాట్లాడుతూ షుగ ర్, బీపీ ఉన్నవారికి మందులను అందించడంతోపాటు వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో ఎవరైనా దగ్గు, జలు బు, ఆస్తమా, ఆయాసం, జ్వరం వంటి ఇబ్బందులు పడుతుంటే వారికి టీబీ పరీక్ష చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో దామోదర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యు లు కవిత, అమృతాజోసఫ్, విజయలక్ష్మి, కార్త్తిక్, జయప్రకాశ్, విజయలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, శ్రీహరి, హెల్త్ సూపర్వైజర్ రవికుమార్, ఫార్మాసిస్ట్ ఉదయ్, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.