ధారూరు, మే 27 : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం నాగారం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో, ధారూరు మార్కెట్ యార్డులో ఏఎంసీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ధారూరు ఎంపీపీ, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు దోర్నాల్ గ్రామానికి చెందిన అనంతయ్యకు దళిత బంధు పథకంలో భాగంగా ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతన్నలు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని, దళారుల చేతిలో అన్నదాతలు మోసపోవద్దన్నారు. తేమ తక్కువగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.
కార్యక్రమంలో ధారూరు ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, మండల వ్యవసాయ అధికారి జ్యోతి, ఏఈవోలు సంజీవ్‌రాథోడ్, హరిప్రసాద్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజునాయక్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు వెంకటయ్య, ధారూరు పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సంతోశ్‌కుమార్, వైస్ చైర్మన్ అంజయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచులు సుజాత, వీరేశం, వెంకటయ్య, అమర్నాథ్, చంద్రమౌళి, నాయకులు అంజయ్య, నరోత్తం రెడ్డి, రాంచంద్రయ్య, లక్ష్మయ్య, చంద్రయ్య, జైపాల్‌రెడ్డి, విజయ్‌కుమార్, వెంకట్ రామ్‌రెడ్డి, దేవేందర్ పాల్గొన్నారు.
వికారాబాద్, మే 27 : లీకేజీలు లేకుండా మిషన్ భగీరథ నీటిని అందించాలని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గుడుపల్లిలో మీతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీల్లో తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పైపులకు గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి, ప్రజలు చెర్రలు తీయకుండా నీటిని వాడుకోవాలన్నారు. వారానికోసారి ట్యాంక్‌ను శుభ్రం చేయాలని సూచించారు. అవసరమైన చోట కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి, విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.
పంట పొలాల్లో వేలాడుతున్న కరెంట్ తీగలను సరిచేసి, ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికి వెంటనే బిల్లులు మంజూరు చేయాలని సూచించారు. మా ఇంటికి రండి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, కమిషనర్ శరత్చంద్ర, కౌన్సిలర్ సంతోష, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాండు, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ ముత్తహర్‌షరీఫ్, నాయకులు పాల్గొన్నారు.