షాబాద్, మార్చి 24: తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య డిమాండ్ చేశారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్స్‌లో జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నంతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి ట్యాక్సులు తీసుకోవడమే తప్ప…తిరిగి ఒక్క పైసా కూడా ఇవ్వడంలేదని మండిపడ్డారు. కేంద్రం ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అవలంబించడం మంచిది కాదన్నారు. పంజాబ్‌లో రెండు పంటలకు సంబంధించిన ధాన్యాన్ని కొంటున్న కేంద్రం తెలంగాణపై వివక్ష చూపడం సరికాదన్నారు. తెలంగాణపై కక్ష పెంచుకుని ధాన్యం కొనకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నా రు. నేటి నుంచి అన్ని గ్రామ పంచాయతీల్లో ధాన్యాన్ని కేంద్రం కొనాలని తీర్మానం చేసి ప్రధానికి పోస్ట్ ద్వారా పంపించాలని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు సూచించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రత్నం మాట్లాడుతూ బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌పై చేస్తున్న అసత్య ప్రచారంపై మండిపడ్డారు. ధాన్యాన్ని కేంద్రం కొనకపోతే తగిన గుణపాఠం తప్పదన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల జడ్పీటీసీలు పట్నం అవినాశ్‌రెడ్డి, మర్పల్లి మాలతి, కాలె శ్రీకాంత్, గోవిందమ్మ, కాలె జయమ్మ, ఎంపీపీలు మల్గారి విజయలక్ష్మి, కోట్ల ప్రశాంతిరెడ్డి, గోవర్ధ్దన్‌రెడ్డి, కాలె భవాని, గునుగుర్తి నక్షత్రం, టీఆర్ఎస్ పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు ప్రభాకర్, నర్సింగ్‌రావు, మహేందర్‌రెడ్డి, గోపాల్, నాగిరెడ్డి, వాసుదేవ్‌కన్నా, మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు స్వప్నానర్సింహారెడ్డి, బుచ్చిరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు అనంతరెడ్డి, రాంరెడ్డి, అనిత, శేఖర్‌రెడ్డి, మల్లేశ్, నాగార్జునరెడ్డి, కృష్ణారెడ్డి, రాంరెడ్డి, నర్సింహారెడ్డి, జయవంత్, రామేశ్వర్‌రెడ్డి, యాదగిరి, మాణిక్యరెడ్డి, చాంద్‌పాషా పాల్గొన్నారు.