షాబాద్, అక్టోబర్ 24 : రంగారెడ్డి జిల్లాలోని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని.. అందుకు ఎంపీడీవోలు కృషి చేయాలని కలెక్టర్ శశాంక సూచించారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో కలెక్టర్ ఎంపీడీవోలతో వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు, కమ్యూనిటీ శానిటరీ సముదాయా లు, ప్లాస్టిక్, ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రే వాటర్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..కొత్తగా నిర్మిస్తున్న ఇం డ్లకు ఐహెచ్హెచ్ఎల్ఎస్ మంజూరు ద్వా రా అన్ని అర్హతలతో హౌస్ హోల్డ్‌లకు అందిస్తామన్నారు.
గతంలో ఏదైనా పథ కం ద్వారా లబ్ధి పొందిన వారికి ఐహెచ్హెచ్ఎల్ఎస్ మంజూరు చేయొద్దన్నారు. వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు వినియోగంలో ఉండే లా చూడాలని, సింగిల్ పిట్ టాయిలెట్లను ట్విన్ పిట్ టాయిలెట్లుగా మార్చాలన్నారు. గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన జరుగకుండా ఎంపీడీవోలు చొరవ చూపాలన్నారు. కమ్యూనిటీ శానిటరీ కాం ప్లెక్స్‌లను మండలాల్లోని రెసిడెన్షియల్ స్కూళ్లు, టూరిస్టు ప్రాంతాలు, బస్టాండ్లు, ఆలయాలు, దవాఖానల ఆవరణలు, మార్కెట్ పరిసర ప్రాంతాల్లో నిర్మించాలన్నారు. అంతేకాకుండా షాప్, బాతింగ్, బేబీ ఫీడింగ్ వంటి అవసరాలను కూడా కమ్యూనిటీ సర్వీసెస్ సెల్ అందుబాటులోకి తీసుకురావొచ్చునని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ జిల్లా పరిధిలో రెండు యూనిట్లు లేదా ఇంకా ఎక్కువైనా ఏర్పా టు చేసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు.
గ్రే వాటర్ మేనేజ్మెంట్లో భాగంగా అన్ని గ్రామాల్లో కమ్యూనిటీ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని, కమ్యూనిటీ సోక్పిట్లను అన్ని ప్రభుత్వ భవనాల్లో నిర్మించాలన్నారు. కొత్త గ్రామాల్లో సెగ్రిగేషన్ షెడ్లు, సాధ్యమైన చోట ఘన వ్యర్థాల నిర్వహణ షెడ్లను ఏర్పాటు చేయాలన్నారు. వన మ హోత్సవంలో భాగంగా ఇప్పటికే నాటిన అవెన్యూ, బ్లాక్ మొక్కలను సంరక్షించేందు కు సరిపడా నీటిని అందించేందుకు వాటర్ ట్యాంకులను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అధికారులు ప్రతి మండలం లో 3 నుంచి 5 గ్రామాలను ఎంపిక చేసుకొని ప్రత్యేక శ్రద్ధ, దత్తత వంటి చర్యలు చేపడుతూ వాటిని మోడల్‌గా తీర్చిదిద్దాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్డీవో శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్, సీపీవో సౌమ్య, మండల అభివృద్ధి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.