మైలార్‌దేవ్‌పల్లి, సెప్టెంబర్ 28 : మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు మా ర్కింగ్ చేసిన ఇండ్ల ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి వెళ్తే వారికి మెరుగైన వసతులు కల్పిస్తామని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శనివారం సాయంత్రం రాజేంద్రనగర్‌లోని తహసీల్దార్ కార్యాల యంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘట్ వరకు 11.7 కిలోమీటర్లు, బాపూఘట్ నుంచి జియాగూడ కమేలా వరకు నాలుగు కిలోమీటర్లు, హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘట్కు 9 కిలోమీట ర్లు రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తాయన్నారు. గండిపేట, రాజేంద్రనగర్ మండ లాల్లోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో దాదాపుగా 339 ఇండ్లను గుర్తించామని ..ఇవి కేవలం రివర్ బెడ్ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలేనని.. అధికారులు, సిబ్బంది వెళ్లి చర్చలు జరుపుతున్నదీ ఆ కుటుంబాలతోనని ఆయన స్పష్టం చేశారు.
వారు స్వచ్ఛందంగా అంగీకరించి వెళ్తామంటే నార్సింగి, జియాగూడల్లో అన్ని రకాల మౌలిక వసతులతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయిస్తామన్నారు. శనివారం సాయంత్రం వరకు 22 కుటుంబాలు వారికి కేటాయించిన ఇండ్లకు వెళ్లారని.. ఆదివారమూ మరికొంత మంది వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భం గా డబుల్ బెడ్రూం ఇండ్లలోకి వెళ్లిన పలువురు..
ఆ ఇండ్లలో మరిన్ని వసతులు కల్పించాలని, మహిళా సంఘాల్లో సభ్యులుగా చేర్పించాలని, బ్యాంకు రుణాలు అందేలా చూడాలని కోరుతున్నారని.. వారిని అన్ని విధాలా ఆదుకుని పునరావా సం కల్పిస్తామని కలెక్టర్ శశాంక హామీ ఇచ్చారు. ఎవరినీ భయపెట్టి, బెదిరించి ఇం డ్ల నుంచి పంపించే యత్నం చేయమని తేల్చి చెప్పారు. ప్రజలు అధికారులు, సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతి మాసింగ్, ఆర్డీవో వెంకట్‌రెడ్డి, రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.