రంగారెడ్డి, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ):తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇంట్లో గురువారం రక్షా బంధన్ ఘనంగా జరుపుకొన్నారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో అతని సోదరీమణి నర్మదారెడ్డి రాఖీ కట్టారు. మంత్రి కుమారుడు పట్నం రివీష్ రెడ్డికి సోదరి మనీషారెడ్డి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డికి సోదరి అనూష రాఖీ కట్టారు. బీఆర్ఎస్ పార్టీ శంషాబాద్ మహిళా విభాగం నాయకురాలు దీపా మల్లేశ్ మంత్రి మహేందర్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలను మహోన్నతంగా చాటే పండుగ ‘రాఖీ’ అని పేర్కొన్నారు.