హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సంబురాల్లో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 25వ తేదీన నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన మినీ ప్లీనరీలు విజయవంతం కావడంతో అదే జోష్‌తో హైదరాబాద్ ప్లీనరీలో పాల్గొన్నారు.
ఎన్నికలు రానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. మంత్రి సబితారెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీలు రంజిత్‌రెడ్డి, రాములుతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.