బుధవారం 28 అక్టోబర్ 2020
Rangareddy - Sep 21, 2020 , 00:58:48

మార్కెట్‌ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యత..

మార్కెట్‌ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యత..

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం  

విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి 

చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం uనవాబుపేట మండలం పులుమామిడి, లింగంపల్లి పంచాయతీ భవనాలు ప్రారంభం

చేవెళ్ల రూరల్‌ : సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం మహిళలకు సముచితం స్థానం కల్పిస్తున్నదని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితాహరనాథ్‌రెడ్డి హాజరై చైర్‌పర్సన్‌గా మద్దెల శివనీల నర్సింహులు, వైస్‌ చైర్మన్‌గా గిరిధర్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ. సీఎం కేసీఆర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి మహిళలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టంతో రైతులకు నష్టం జరుగొద్దనే విద్యుత్‌ బిల్లుపై అసెంబ్లీలో తీర్మా నం చేశారన్నారు. కరోనా సమయంలోనూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా రైతుల వద్ద నుంచి ప్రతి గింజనూ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు.  

నియోజకవర్గాల్లో గోదాములు..

మూడు సంవత్సరాల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తిచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.  కోటి యాభై ఎకరాలు రైతుబంధు ఇవ్వడంతో కోటి ఎకరాల మాగాణి తెలంగాణ సాకారం దిశగా అడుగులు పడ్డాయని తెలిపారు. బడ్జెట్‌లో రూ.14,500 కోట్లు ప్రతి ఏటా రైతుబంధు కోసం ప్రభుత్వం కేటాయిస్తున్నదన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, పండించిన పంటను నిలువ చేయడానికి 20 ఎకరాల్లో నియోజకవర్గాల్లో గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమానికి ముందు చేవెళ్ల చేరుకున్న మంత్రి సబితారెడ్డికి రైతులు ఎడ్ల బండ్లతో స్వాగతం పలికారు. 

రైతు సంక్షేమ ప్రభుత్వం : ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నదన్నారు. నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే యాదయ్య అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.

పథకాలు సద్వినియోగం చేసుకోవాలి : జడ్పీ చైర్‌పర్సన్‌

సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రవేశపెడుతున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితాహరనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. మార్కెట్‌ కమిటీ పాలక వర్గం రైతుల సమస్యలు పరిష్కరించి వారి అభివృద్ధికి పాటు పడాలని సూచించారు. 

మంత్రి సహకారంతో అభివృద్ధి : ఎమ్మెల్యే యాదయ్య

మంత్రి సబితారెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే యాదయ్య తెలిపారు. చేవెళ్లలోని డిగ్రీ కళాశాల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రికి విన్నవించారు. దానికి మంత్రి సబితారెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే నియోజకవర్గంలో కోట్ల నిధులతో సీసీ, బీటీ రోడ్లు వేశామని మిగతా పనులు ప్రభుత్వ సహకారంతో పూర్తి చేస్తామన్నారు. 

మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిక .. 

కాంగ్రెస్‌ యూత్‌ నాయకుడు బొజ్జెంకి దర్శన్‌ ఆధ్వర్యంలో 100 మంది యూత్‌ నాయకులు మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు గౌండ్ల యాదగిరి, కె.సతీష్‌ కుమార్‌, అబ్దుల్‌ ఘనీ, నిర్మల, ఎరుకల యాదయ్య, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి చంద్రశేఖర్‌, ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్‌, వైస్‌చైర్మన్‌ కన్నె శివప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి పడాల ప్రభాకర్‌, తాసిల్దార్‌ షర్మిళ, ఎంపీడీవో హరీశ్‌, ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు రామేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు శేరి శివారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, దళిత రత్న అవార్డు గ్రహీత బురాన్‌ ప్రభాకర్‌, సీనియర్‌ నాయకులు పి.గోపాల్‌రెడ్డి, దేవర కృష్ణారెడ్డి, రమణారెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ బ్యాగరి నర్సింహులు, అంబేద్కర్‌ సంఘం సభ్యులు బురాన్‌ నర్సింహులు, నాయకులు దర్శన్‌, రాఘవేంద్ర, రాము, బాలాజీ, శ్రీనివాస్‌, ప్రవీణ్‌, మధుసూదన్‌రెడ్డి, బ్యాగరి సత్యయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. 

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

నవాబుపేట: రైతుల బాగుకోరిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని పూలపల్లిలో పెట్రోల్‌ బంకు, పులుమామిడి, లింగంపల్లి గ్రామాల్లో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ స్వయంగా రైతు కష్టాన్ని అనుభవించిన నేపథ్యంలో రాష్ట్రంలో రైతుల బాధలు తీర్చడానికి తనవంతు కృషి చేస్తున్నారన్నారు. ఇందుకు నిదర్శనం రైతు బీమా, రైతు బంధు, తదితర పథకాల అమలే నని మంత్రి స్పష్టం చేశారు.  నూతన రెవెన్యూ చట్టంతో భూస మస్యలు లేని రాష్ట్రంగా చూడబోతున్నామని మంత్రి తెలిపారు. పులుమామిడిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం రోల్‌ మోడల్‌గా ఉన్నదని జిల్లాలో ఈ భవనాన్ని ఆదర్శంగా తీసుకుని నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి కృషి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామం నుంచి చిట్టిగిద్ద రైల్వేష్టన్‌ వరకున్న బీటీ రోడ్డును బాగుచేయించడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాలె భవాని, జడ్పీటీ సీ జయమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంరెడ్డి, ఇన్‌చార్జి తాసిల్దార్‌ కృష్ణ, ఎంపీడీవో సుమిత్రమ్మ, పులు మామిడి, లింగంపల్లి సర్పంచ్‌లు విమలరంగారెడ్డి, నర్సింహు లు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, సీనియర్‌ నాయకులు మల్‌రెడ్డి, ప్రశాంత్‌ గౌడ్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆయా మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

logo