ఆదిబట్ల, ఆగస్టు 9: నేడు ఆదిబట్ల సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాల్లో అంతరాయం ఏర్పడుతుందని ఆదిబట్ల విద్యుత్ ఏఈ జయన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఆదిబట్ల సబ్స్టేషన్ పరిధిలోని 11కేవీ పోలీస్స్టేషన్ ఫీడర్, సాయితేజ అపార్ట్మెంట్, వసంతకార్పొరేషన్, ఏరోసిటీ, టీసీఎస్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరాను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు.
తుర్కయాంజాల్, ఆగస్టు 9 : సాధారణ మరమ్మతుల కారణంగా తుర్కయాంజాల్ సబ్స్టేషన్ పరిధిలోని పలు కాలనీలో శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు ఏడీఈ వినోద్ ఒక ప్రకటనలో తెలిపారు. కమ్మగూడ ఫీడర్ పరిధి ఈస్ట్ సూరజ్ నగర్, ఏపీఏటీ కాలనీ, టీచర్స్ కాలనీ, వీరమణి ఇండస్ట్రీ, నవ భరత్ కాలనీలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా బ్రాహ్మణ పల్లి ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల వరకు తుర్కయాంజాల్ ఫీడర్ పై మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.