లంగర్‌హౌస్ ఠాణా పరిధిలో గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో విధులకు వెళ్తున్న సంతోష్ అనే కానిస్టేబుల్ ఫ్లోర్‌మిల్ వద్ద గుండెపోటుతో కింద పడిపోయాడు. సమాచారం అందుకున్న లంగర్‌హౌస్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానిస్టేబుల్ నరేశ్ సంతోష్‌కు సీపీఆర్ చేసి ప్రాణాన్ని కాపాడారు.
అనంతరం అతడిని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా, సమయానికి సీపీఆర్ అందించడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు కానిస్టేబుల్ నరేశ్‌ను అభినందించారు.
-మెహిదీపట్నం, ఫిబ్రవరి 20