ఆస్తిపన్ను అక్రమాలకు శాశ్వత చెక్..!
ఆస్తిపన్ను చెల్లింపులు, స్వీయ మదింపు (సెల్ఫ్ అసెస్మెంట్) మరింత పారదర్శకంగా ఉండేందుకు జీహెచ్ఎంసీ తెరపైకి సరికొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా వచ్చే దరఖాస్తులను పరిశీలించి, నకిలీ వివరాలు గుర్తించే కొత్త సాఫ్ట్వేర్ను పరిచయం చేస్తున్నది
- తెరపైకి ప్రాపర్టీ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ మెనేజ్మెంట్ సిస్టం
- కొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకొస్తున్న బల్దియా
సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : ఆస్తిపన్ను చెల్లింపులు, స్వీయ మదింపు (సెల్ఫ్ అసెస్మెంట్) మరింత పారదర్శకంగా ఉండేందుకు జీహెచ్ఎంసీ తెరపైకి సరికొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా వచ్చే దరఖాస్తులను పరిశీలించి, నకిలీ వివరాలు గుర్తించే కొత్త సాఫ్ట్వేర్ను పరిచయం చేస్తున్నది. విస్తీర్ణాన్ని తక్కువగా పేర్కొనడం, వాణిజ్య భవనాలను నివాసాలుగా చెప్పి తక్కువ పన్ను చెల్లిస్తున్న కేటుగాళ్ల భరతం పట్టేందుకు ‘ప్రాపర్టీ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ మెనేజ్మెంట్ సిస్టం (పీటీఐఎంఎస్) అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు 36 నెలల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు టెండర్లను ఆహ్వానించారు. సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా ఇప్పటి వరకు జారీ అయిన ఇంటి నంబర్లు, ఎప్పటి నుంచో ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాలను సైతం పీటీఐఎంఎస్ ద్వారా పరిశీలించనున్నారు.
నకిలీ పత్రాలతో ఇంటి నంబర్ తీసుకున్న వారిపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతున్నది. నోటరీ పత్రాలతో జారీ అయిన ఇంటి నంబర్లను గుర్తించి సంబంధిత వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నది. రిజిస్టర్ పత్రాలున్నా…ఆన్లైన్ దరఖాస్తు ద్వారా నిమిషాల్లో ఇంటి నంబర్ ఇవ్వాలనే లక్ష్యంతో ‘స్వీయ మదింపు’ విధానాన్ని తీసుకువచ్చారు. కొందరు ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ తరహా మోసాలను గుర్తించిన అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో దాదాపు 400 మంది పీటీఐఎన్లను బ్లాక్ చేశారు. వీరిపై స్థానిక పోలీస్స్టేషన్లలో కేసు నమోదు చేస్తున్నారు. మోసపూరిత దరఖాస్తు చేసి పీటీఐఎన్(ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు)లు పొందిన వారిపై తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

