మంచాల, జనవరి 30: గ్రామాల అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మంచాల మండలం లింగంపల్లి, బండలేమూరు, అజ్జినాతండా గ్రామాల్లో రూ. 78లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలో ఉన్న గ్రామాల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించి అభివృద్ధికి బాటలు వేయనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మారుమూల గ్రామమైన బండలేమూరు గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి సమస్యలను పరిష్కరించనున్నట్లు చెప్పారు.
లింగంపల్లిలో రూ. 20లక్షలతో సీసీరోడ్డు, రూ. 9లక్షలతో భూగర్భడ్రైనేజీ, బండలేమూరులో రూ. 15లక్షలతో కమ్యూనిటీహల్ భవనం, రూ.14లక్షలతో సీసీరోడ్డుతో పాటు పలు అభివృద్ధి పనులు, బండలేమూరులో రూ. 20లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవనం పనులను ప్రారంభించారు. అంతకుముందుగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గ్రామాల్లో ఉన్న మహిళలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, జడ్పీటీసీ మర్రి నిత్య, సర్పంచ్‌లు పెరిక వినోద, మంగ, కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీలు జయానందం, మధుసూదన్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు వాజీథ్, సహకార సంఘం డైరెక్టర్లు హనుమంతురెడ్డి, జెనిగ వెంకటేశ్‌తో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.