పరిగి, మే1: వేసవి శిబిరాల ఏర్పాటు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని పరిగి మం డల విద్యాధికారి హరిశ్చందర్ పేర్కొన్నారు. సోమవారం పరిగి మండలం చిట్యాల్ గ్రా మంలోని ప్రాథమిక పాఠశాలలో వేసవి ప్రత్యేక శిబిరాన్ని ఎంఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంఈవో మాట్లాడుతూ విద్యార్థులకు వేసవి శిబి రంలో ప్రత్యేకంగా చదవడం, రాయడం, ఇంగ్లీషు, గణితంలపై ప్రత్యేక తరగతులు నిర్వ హించనున్నట్లు పేర్కొన్నారు. వాటితోపాటు ఆటలు, పాటలు, కథలు చెప్పడం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యేక శిబిరం తరగతులు ఉంటాయని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంకట్, ఉస్మాన్అలీ, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ జంగా కృష్ణ, క్లస్టర్ రిసోర్స్‌పర్సన్ అనంతవిద్యాసాగర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బషీరాబాద్ : విద్యార్థులు వేసవి పఠన శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి సుధాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని గొట్టిగఖుర్ధు, మంతన్గౌడ్తండాలో ప్రాథమిక పాఠశాలల్లో వేసవి పఠన శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు చదువుకు దూరం కాకుండా వారిలో ఉన్న నైపుణ్యాలు వెలికితీయడానికి పఠన శిబిరాలు ఉపయోగ పడుతాయని పేర్కొన్నారు. హెచ్ఎం మురహరినాథ్ మాట్లాడుతూ విద్యార్థులకు సమ్మర్ రీడింగ్ క్యాంప్‌లో బోధించడానికి గ్రామానికి చెందిన బీ టెక్ విద్యార్ధిని దేవమ్మ, డీఎడ్ విద్యార్థిని సునీత వాలంటీర్లుగా రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ విష్ణువర్దన్‌రెడ్డి, పాఠశాల చైర్మన్ బాలప్ప, గ్రామస్తులు విజయ్‌కుమార్, సునీల్, రమేశ్, నరేశ్, అంజిలయ్య, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
దోమ: దోమ మండల పరిధిలోని బొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో కాంప్లెక్స్ హెచ్ఎం హరిలాల్తో కలిసి ఎంపీటీసీ రాములు సోమవారం సమ్మర్ క్యాంప్‌ను ప్రారంభించా రు. క్యాంపు నిర్వహణకు పాఠశాల పూర్వ విద్యార్థి రవళి ముందుకు రావడాన్ని పలువురు అభినందించారు. కార్యక్రమంలో హెచ్ఎం పురందాస్, ఉపసర్పంచ్ రఫీక్‌పాషా, హెచ్ఎం షఫీ, చైర్మన్ శ్రీనివాస్, సీఆర్పీ వెంకటేశ్, ఉపాధ్యాయుడు సత్తయ్య, శేఖర్ పాల్గొన్నారు.
బొంరాస్‌పేట: దుద్యాల మండల కేంద్రంలోని దళితవాడ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి పఠన కేంద్రాన్ని సర్పంచ్ మహ్మద్ ఖాజా ప్రారం భించారు. సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు ఎండాకాలం సెలవుల్లో ఎండకు తిరగ కుండా కేంద్రాలకు వచ్చి చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం జలం ధర్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ శకనప్ప, సీఆర్పి శశివర్ధన్, వాలంటీర్ అంజిలయ్య పాల్గొన్నారు.