వికారాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): జిల్లాలో రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపా రు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెండు, మూడో విడతల్లో జిల్లాలోని 594 గ్రామ పంచాయతీలు, 5058 వార్డులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. అయితే రెండో విడతలో 288 జీపీలకు, 2490 వార్డులకు, మూడో విడతలో 306 జీపీలకు, 2568 వార్డులకు ఎన్నికలు జరుగనున్నట్లు పేర్కొన్నారు.
జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 20 జడ్పీటీసీ స్థానాలకు మొదటి విడతలో కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాలతోపాటు వికారాబాద్ నియోజకవర్గంలోని వికారాబాద్, ధారూరు, మర్ప ల్లి, మోమిన్‌పేట, కోట్‌పల్లి, బంట్వారం మండలాలు, చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలానికి ఎలక్షన్స్ ఉంటాయని.. రెండో విడతలో పరిగి, పూ డూరు, కులకచర్ల, దోమ, చౌడాపూర్, తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండలాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు.
జిల్లాలో 227 ఎంపీటీసీ స్థానాలుండగా, మొదటి విడతలో 115 స్థానాలకు, రెండో విడతలో 112 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికల సిబ్బందికి ఒక దశ శిక్షణ కూడా పూర్తయ్యిందన్నారు. కాగా, జిల్లాలో 5058 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 20 శాతం అదనంగా బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు.
వికారాబాద్‌లోని ఎస్ఏపీ కాలేజీ, పరిగిలోని జడ్పీహెచ్ఎస్ బాలికల స్కూల్, కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, తాండూరులోని సెయింట్ మార్క్స్ హైస్కూల్లలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను.. వికారాబాద్‌లోని ఎస్ఏపీ కాలేజీ, పరిగిలోని జడ్పీహెచ్ఎస్ బాలుర స్కూల్, తాం డూరులోని సెయింట్ మార్క్స్ హైస్కూల్లలో స్ట్రాంగ్‌రూంలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రతీక్ జైన్ వెల్లడించారు.
ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు 12 మంది నోడల్ అధికారులతోపాటు 105 మంది జోనల్ స్థాయి అధికారులు, 45 ఫ్లయింగ్ స్కాడ్స్ బృందా లు, 59 సిట్టింగ్ స్కాడ్స్ బృందాలు, 20 ఎంసీసీ బృందాలను నియమించామన్నారు. అదేవిధంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో షెడ్యూల్ విడుదల అయిన నాటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, నోటిఫికేషన్ జారీ కాగానే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షురూ అవుతుందని, నామినేషన్ల స్వీకరణ కు మండల కేంద్రాల్లో ఏర్పాట్లు ఏర్పాట్లు చేశామన్నా రు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్‌చౌదరి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సుధీర్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
అధికారులకు సూచించిన రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి
రంగారెడ్డి, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో పోలీస్ అధికారులు, ఎంపీడీవోలు, ఎన్నికల నోడల్ అధికారులు, అదనపు కలెక్టర్లతో కలిసి జిల్లాస్థాయి సమన్వయ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు నోడల్ అధికారులు కీలకంగా వ్యవహరించాలన్నారు.
అభ్యర్థుల సభలు, ర్యాలీలు, సమావేశాల కోసం అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ప్రొసైడింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని అన్నారు. స్ట్రాం గ్రూం, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు తదితర ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశంలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, చంద్రారెడ్డి, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, అదనపు డీసీపీలు, జడ్పీసీఈవో కృష్ణారెడ్డి, పంచాయతీ అధికారి సురేశ్ మోహన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ పాల్గొన్నారు.