Ayesha Khan | డ్యాన్సింగ్ క్వీన్‌గా పేరుగాంచిన ఆయేషా ఖాన్ ఓ ఫోటోగ్రాఫర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ముంబైలో జరిగిన Tu Ya Main స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. స్క్రీనింగ్‌కు హాజరైన ఆయేషా రెడ్ కార్పెట్‌పై ఫోటోలకు పోజులు ఇస్తుండగా, కొందరు ఫోటోగ్రాఫర్లు ఆమెను వెనుక వైపు నుంచి వీడియో తీయడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన ఆమె వెంటనే అసహనం వ్యక్తం చేస్తూ వారిని సున్నితంగా హెచ్చరించారు. “ఆప్ ఇజ్జత్ ఖుద్ కమాయేంగే, ఔర్ ఖుద్ హీ గవ్వాయేంగే… ప్లీజ్ మత్ కరియే, అచ్చా నహీ లగ్తా” అంటూ హిందీలో వ్యాఖ్యానించారు. అంటే “గౌరవాన్ని మీరే సంపాదించుకుంటారు… మీరే కోల్పోతారు… దయచేసి ఇలా చేయకండి, ఇది మంచిది కాదు” అనే అర్థం. ఆమె వ్యాఖ్యలు అక్కడున్న వారిని కాసేపు ఆలోచింపజేశాయి.
సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల వ్యక్తిగత గోప్యతను పట్టించుకోకుండా అసభ్యకర యాంగిల్స్‌లో ఫోటోలు తీయడం పెరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఆయేషా స్పందిస్తూ “ఊప్స్ మూమెంట్స్ కోసం వెతకడం సరైంది కాదు” అని అభిప్రాయపడింది. ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన వెంటనే అక్కడ ఉన్న ఇతర ఫోటోగ్రాఫర్లు కూడా మద్దతుగా నిలవడం విశేషం. సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ఆయేషాకు మద్దతు తెలుపుతూ “సెలబ్రిటీలకు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ స్క్రీనింగ్‌కు అనన్యా పాండే, ఖుషీ కపూర్, అనిల్ కపూర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయేషా ఖాన్ వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా, టాలీవుడ్ మరియు బాలీవుడ్ ప్రాజెక్టులతో కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.అయేషా ఖాన్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. తెలుగులో కూడా పలు చిత్రాలు చేస్తుంది. రామ్ చరణ్ – బుచ్చిబాబు చిత్రం పెద్దిలో అయేషా ఒక కీలక పాత్రకు ఎంపికైనట్లు సమాచారం.. డిజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ సినిమాలోను అయేషా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు బాలీవుడ్ లో పలు చిత్రాలతో అయేషా బిజీ బిజీగా ఉంది.