Chevella | చేవెళ్ల టౌన్, మార్చి 25 : గ్రామాల్లో మొక్కు నాటితే పచ్చదనంతో పాటు కాలుష్యాని తగ్గించి, వర్షాలు సమవృద్ధిగా కురువడంతో భూగర్బ జలాలు పెరుగుతాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామానికి ఒక పల్లెప్రకృతితో పాటు హరిహారం కార్యక్రమం చేపట్టింది. హరిత హరం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి నర్సరీలను ఏర్పాటు చేయడంతో పాటు పల్లెప్రకృతి వనాలలో పూలు, పండ్ల మొక్కలతో పాటు వివిధ ఔషధాలు కలిగిన మొక్కలను పెంచి, అనునిత్యం వాటికి నీరును అందించటంతో పాటు మధ్యలో కలుపును తీయించి కంటికి రెప్పలా ప్రతి మొక్కలను కాపాడేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకొవడంతో పల్లెప్రకృతి వనాలు పచ్చదనంతో కళకళాలాడుతుండేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు వాటిని పట్టించుకోకపోవడంతో మొక్కలు ఎండిపోయి వెలవెల పోవడంతో పచ్చదనం కనుమరుగు అవుతుండటంతో పచ్చదనంపై ప్రభుత్వం దృష్టి సాదించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పల్లెప్రకృతి వనాలకు అదికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మద్యం తాగడానికి అడ్డగా మార్చుకున్నారు. పల్లె ప్రకృతిలో ఎక్కడ చూసిన మద్యం బాటిల్స్ దర్శనము ఇవ్వడంతో పాటు వాటిని అక్కడే పగలగొట్టి జారుకుంటున్నారు. పల్లెప్రకృతికి వాకింగ్‌కు వచ్చే వారికి కూర్చోవడానికి ఏర్పాటు చేసిన సిమెంట్ బెంచీలను సైతం విరగొట్టినా అధికారులు పట్టి పటనట్లు వ్యవహరిస్తున్నారు.