Shadnagar | షాద్‌నగర్ రూరల్, మార్చి 19 : పచ్చదనం ఉంటే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్ని, దీంతో పాడిపరిశ్రమలో ఎంతో అభివృద్ది సాధించవచ్చని, అంతేకాకుండా పచ్చదనం వల్ల స్వచ్చమైన అక్సిజన్ లభిస్తుందని, ఎలాంటి అంటువ్యాధులు వ్యాపించవని, కాలుష్య రహిత సమాజంను నెలకోల్పవచ్చని గత బీఆర్ఎస్ సర్కార్ గ్రామాల్లో హరితహారం కార్యక్రమంతో పాటు, పల్లెప్రకృతి వనాలకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వ హయంలో పచ్చదనం కోసం నిధులను సైతం కేటాయించింది. దీంతో పాటు పల్లెప్రకృతి వనాలను సంరక్షించేందుకు ఎన్ఆర్జిఎస్ నిధులతో పాటు, గ్రామపంచాయతీ నిధులు వెచ్చించేలా వెసులబాటు కల్పించింది. దీంతో ఏ గ్రామంలో చూసిన పల్లెప్రకృతి వనాలు పచ్చదనంతో కళకళలాడుతుండేవి. పల్లెప్రకృతి వనాలలో స్వచ్చమైన ఆక్సిజన్ అందించే మంచి పూలమెక్కలు, పండ్ల మొక్కలతో పాటు వివిధ ఔషాదలు కలిగిన మొక్కలను పెంచేవారు. అనునిత్యం వాటికి నీరును అందించి మొక్కల మద్యలో కలుపును తీయించేవారు. కంటికి రెప్పలా ప్రతి మొక్కను కాపాడేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పచ్చదనం కనుమరుగువుతున్నాయి.
ఫరూఖ్‌నగర్ మండలంలోని 47 గ్రామపంచాయతీలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చదనంను నెలకోల్పేందుకు పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. వాటిలో వివిధ రకాల పూలు, పండ్లు, ఆహ్లాదంను అందించే మొక్కలను పెంచేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. కానీ నేడు కాంగ్రెస్ సర్కార్ వచ్చాక పచ్చదనం కనుమరుగువుతుంది. గ్రామాల అభివృద్దికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో పల్లెప్రకృతి వనాలు ఎడారిని తలపిస్తున్నాయి. ఇప్పటికైన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలభివృద్దితో పాటు, పచ్చదనంపై దృష్టి సారించాలని గ్రామస్తులు కొరుతున్నారు.
గత బీఆర్ఎస్ సర్కార్ హయంలో మా గ్రామం ఎంతో అభివృద్దిని సాధించింది. గ్రామాభివృద్ధికి గత ప్రభుత్వం ప్రత్యేక నిధులను సైతం కేటాయించింది. నిధులతో మా గ్రామంలోని పల్లెప్రకృతి వనంలోని మొక్కలను కంటికి రెప్పలా కాపాడేవారు. నేడు నీరు లేక, మొక్కలను సంరంక్షించేవారు లేక మొక్కలని ఎండిపోయాయి. పచ్చదనంపై దృష్టి సారించాలి.
-మచ్చేందర్