వికారాబాద్,జూన్ 12 : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని శాసన సభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. బుధవారం మోమిన్‌పేట మండల కేంద్రంలోని రూ.1.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక భవనాన్ని ఆయన జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ పీహెచ్సీలో రోగులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. మోమిన్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరిందని, అ భవనాన్ని ఖాళీ చేసి కొత్త భవనంలోకి మార్చాలని సూచించారు. రోగులకు అవసరమైన మందులు, సౌకర్యలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. అనంతరం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హాజరై స్పీకర్‌తో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పాల్వాన్కుమార్లను అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు. అనంతరం దవాఖానలోని వార్డులను పరిశీలించారు. వారి వెంట ఆర్డీవో వసు చంద్ర, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో జీవరాజ్, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.