కడ్తాల్, డిసెంబర్ 30 : నిత్య ధ్యాన సాధనతో జ్ఞానం, మానసిక ప్రశాంతత లభిస్తున్నదని… మ హేశ్వర మహా పిరమిడ్, పత్రీజీ శక్తిస్థల్ ప్రపంచ ధ్యాన ప్రధాన కార్యాలయంగా విరాజిల్లుతున్నదని పీఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రీ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్‌లో, ది పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్టు చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగాలు శనివారం నాటికి పదో రోజుకు చేరుకున్నాయి.
ఉదయం 5 నుంచి 8 గంటల వరకు నిర్వహించిన, ప్రాతఃకాల ధ్యానంలో ఆధ్యాత్మిక గురువులు, ధ్యానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానులనుద్దేశించి పరిమళ పత్రీ మాట్లాడుతూ.. ధ్యానంతో ఒత్తిడి తగ్గిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. మనలో మనం కలిసిపోవడమే ధ్యానమని, ధ్యానంతో అ పారమైన జ్ఞానం, ఆనందమయ జీవితం పొందవచ్చని పేర్కొన్నారు. మంచి ఆలోచనలు, సద్గుణాలు కలిగి ఉన్న వారికి మంచి భవిష్యత్తు ఉం టుందన్నారు. 2024లో నిర్వహించే ధ్యానసభలకు పత్రీజీ మహిళా ధ్యాన యాగంగా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు.
పరిణిత పత్రీ మాట్లాడుతూ.. సుభాష్ పత్రీజీ ముందుచూపుతో ఆత్మ గ్రంథాలను అధ్యయనం చేసి, జ్ఞానాన్ని ధ్యానులకు అందించారని తెలిపా రు. పత్రీజీ శిష్యులు ఎంతో మంది జ్ఞాన యోగులుగా మారి ప్రపంచానికి ధ్యానం నేర్పుతున్నారని తెలిపారు. విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడు తూ.. ప్రపంచ స్థాయిలో పత్రీజీ శక్తిస్థల్ నిర్మాణా న్ని చేపడతామని తెలిపారు.
శక్తిస్థల్ నిర్మాణానికి పాల్వంచ గ్రామానికి చెందిన జయశ్రీ రూ.లక్ష విరాళంగా అందజేశారు. ధ్యాన వేదికపై నిర్వహిస్తున్న గాయకుల గీతాలాపనలు, సాంస్కృతిక కా ర్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. కార్యక్రమం లో పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, సభ్యులు హన్మంతురాజు, సాంబశివరావు, శ్రీరామ్‌గోపాల్, రాఘవరావు, శివప్రసాద్, దామోదర్‌రెడ్డి, శివప్ప, కిషన్‌రెడ్డి, మహేశ్వరి, మాధవి, లక్ష్మి, నవకాంత్, తహసీల్దార్ ముంతాజ్, సీఐ శివప్రసాద్, ధ్యానులు పాల్గొన్నారు.