మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Sep 05, 2020 , 01:09:07

కొనసాగుతున్న అభివృద్ధి పనులు

 కొనసాగుతున్న అభివృద్ధి పనులు

 ఎల్బీనగర్‌ : జీహెచ్‌ఎంసీలోనే తొలిగా ఏర్పాటు చేసిన చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ కంప్యాక్టర్‌ను జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లు సందర్శిస్తున్నారు.  హస్తినాపురం డివిజన్‌ నందనవనంలో  కంప్యాక్టర్‌ను జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ జోన్‌ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు.  వివరాలను ఆయన ఎల్బీనగర్‌ సర్కిల్‌ ఉప కమిషనర్‌ విజయకృష్ణను అడిగి తెలుసుకున్నారు.  శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌  కంప్యాక్టర్‌ను సందర్శించారు.  మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు అన్ని జోన్ల కమిషనర్లు నందనవనం కంప్యాక్టర్‌ను సందర్శిస్తున్నారు.  

 చర్లపల్లి  : ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని కార్పొరేటర్‌ పావనీమణిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సుబ్రమణ్యనగర్‌, మార్కండేయనగర్‌లో ఆమె పర్యటించారు.  

పారిశుధ్య పనులు వేగవంతం..

 నూతనంగా ఏర్పడిన కృష్ణ ఎన్‌క్లేవ్‌లో పారిశుధ్య సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డివిజన్‌ కార్పొరేటర్‌  పేర్కొన్నారు. 

 ఉప్పల్‌ :   రోడ్డు సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని నాచారం కార్పొరేటర్‌ శాంతిసాయిజెన్‌శేఖర్‌ అన్నారు.   న్యూఅంబేద్కర్‌నగర్‌లో కొత్తగా సీసీ రోడ్లు వేయాలని కోరుతూ కాలనీవాసులు శుక్రవారం కార్పొరేటర్‌కు వినతిపత్రం అందజేశారు.  చిలుకానగర్‌ డివిజన్‌లోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ  కార్పొరేటర్‌ గోపు సరస్వతి సదానంద్‌ శుక్రవారం ఉప్పల్‌ డీసీ అరుణకుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు.  వర్షాలతో బండరాళ్లు దొర్లడంతో విరిగిపోయిన విద్యుత్‌ స్తంభాలను పునరుద్ధరించడం హర్షణీయమని చిలుకానగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్‌ ముదిరాజ్‌ అన్నారు. స్తంభాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేశామన్నారు. చిలుకానగర్‌లోని హనుమాన్‌ టెంపుల్‌ ప్రాంతంలో  విద్యుత్‌ స్తంభాల నిర్మాణ పనులను పరిశీలించారు.   

     మల్లాపూర్‌ : మూడు రోజులుగా మంచినీరు రావడంలేదని హెచ్‌బీకాలనీ డివిజన్‌ ఎన్టీఆర్‌నగర్‌, శాంతినగర్‌, న్యూ నర్సింహానగర్‌కాలనీ ప్రజలు కార్పొరేటర్‌ గొల్లూరి అంజయ్యను కలిశారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం జలమండలి ఏఈ వేణుగోపాల్‌తో కలిసి కాలనీల్లో పర్యటించారు. మంచినీటి పైపులైన్లలో చెత్త చెదారం నిండటంతో నీరు రావడంలేదని గ్రహించిన కార్పొరేటర్‌ ఏఈ వేణుగోల్‌ను వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. వీఎన్‌ఆర్‌ గార్డెన్‌ ముందు తిరుమల రెసిడెన్సీ వద్ద వర్షపు నీరు చేరడంతో ఎన్టీఆర్‌నగర్‌కు వెళ్లే ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని స్ధానికులు కార్పొరేటర్‌ దృష్టికి తీసుకువచ్చారు. రోడ్డు సమాంతరంగా చేసి వర్షపు నీరు చేరకుండ సీసీ రోడ్డు వేయాలని కార్పొరేటర్‌ ఏఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ మాజీ అధ్యక్షుడు వంజరి ప్రవీణ్‌, సోములు, బీరప్ప, రాజు, కాలనీవాసులు పాల్గొన్నారు. అలాగే న్యూ నర్సింహానగర్‌కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న మహిళా భవనంనాన్ని పరిశీలించారు.  భవనం వద్ద మూత్ర శాలలు నిర్మించలేదని స్థానికులు కార్పొరేటర్‌ దృష్టికి తీసుకురాగా, మూత్ర శాలలు నిర్మించాలని ఏఈకి కార్పొరేటర్‌ తెలిపారు. 

 మల్లాపూర్‌  : కాలనీ సమస్యలను పరిష్కరించాలంటూ మల్లాపూర్‌ డివిజన్‌ దత్తాత్రేయనగర్‌ కాలనీవాసులు కార్పొరేటర్‌ పన్నాల దేవేందర్‌రెడ్డికి  వార్డు కార్యాయంలో వినతిపత్రం ఇచ్చారు.  

 చర్లపల్లి, కాప్రా  :   ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు  కార్పొరేటర్‌ స్వర్ణరాజు శివమణి  శుక్రవారం డివిజన్‌ పరిధిలోని కేసీఆర్‌ కాలనీలో  పర్యటించి  వాటర్‌వర్క్స్‌ డీజీఎం కృష్ణను కాలనీవాసి దొమ్మాటి కిరణ్‌కుమార్‌రావు ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు.