పెద్దేముల్, ఏప్రిల్ 23: ఓమ్ల నాయక్ తండా కేంద్రంగా ఎర్రమట్టి తవ్వకాలు చేపడుతూ కొందరు ఖనిజ సంపదను కొల్లగోడుతున్నారు. పెద్దేముల్ మండల పరిధిలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో గల ఓమ్లా నాయక్ తండా సర్వే నంబర్ 449 ప్రభుత్వ భూమిలో తవ్వకాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతం ఎర్ర మట్టికి పెట్టింది పేరుగా ఉంది. ఎటు చూసిన లాటరైట్ గుట్టలు అనిపిస్తుండడంతో ఆ గుట్టలపై కన్నేసిన కొందరు అక్ర మార్కులు రాత్రిళ్లు భారీయంత్రాలతో వందల టిప్పర్లతో ప్రభుత్వ సంపదను కోల్లగోడుతున్నారు. ఇంత జరుగుతున్న సంబందిత మైన్స్ రెవెన్యూ అధికారులు మాత్రం ఏలాంటి స్పందన లేకుండా ఉండటం గమన్హారం.
పత్రికల్లో కథనాలు వచ్చిన రెండు రోజులు కట్టడి చేసి తూతూ మంత్రంగా జరిమానాలు విధిం చి చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వానికి భారీ ఆదాయం తెచ్చి పెట్టే ఖనిజ సంపత అక్రమార్కుల చేతుల్లో పడి ఆవిరై పోతున్న పట్టించుకునే నాథుడు లేడని ఓమ్ల నాయక్ తండా సర్పంచ్ సుమిత్ర రాథోడ్ స్వయంగా మిడియాకు తెలిపారు. సమీప గ్రామాల గుండా భారీ యంత్రాలు టిప్పర్లతో దర్జాగ అక్రమ దందా నడుస్తున్న అక్రమార్కులను కట్టడి చేసే అధికారులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా అటువైపు కన్నెత్తి కూడ చూడకుండా ఉండడంతో అధికారులపై సమీప గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఓమ్ల నాయక్ తండాలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలును ఆపి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.