రంగారెడ్డి, మే 27 (నమస్తే తెలంగాణ): పల్లెప్రగతి కార్యక్రమంలో అధికారులంతా సమన్వయంతో పనిచేసి, విజయవం తం చేయాలని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్ రెడ్డి సూచించారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని జడ్పీ సమావేశ మందిరంలో పల్లెప్రగతిపై ఎంపీడీవోలతో ఆమె సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామా ల్లో తడి-పొడి చెత్తను వేరు చేసేలా ప్రజలను చైతన్యపర్చాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తామ ని, అందరూ అప్రమత్తంగా ఉండి పనులను సక్రమంగా చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో దిలీప్‌కుమార్, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
పరిగి, మే 27: హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈసారి జిల్లాలోని రోడ్లకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు నాటాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా అటవీ శాఖ అధికారి వేణుమాధవరావు, డీఆర్డీవో కృష్ణన్లతో కలిసి హరితహారంపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఈసారి గతంలో కంటే భిన్నంగా పెద్ద ఎత్తున పెద్ద సైజు మొక్కలతో అవెన్యూ ప్లాంటేషన్ చేసి జిల్లాను పచ్చగా మార్చాలన్నారు. స్థలాలను గుర్తించిన ఐదు రోజుల్లోనే గుంతలను తవ్వే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మన్నెగూడ నుంచి కొడంగల్ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా మూడు వరుసల్లో డీఎఫ్‌వో ఆధ్వర్యంలో మొక్కలను నాటాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని ప్రధాన రోడ్లపై మొక్కలను నాటాలన్నారు.
హెచ్ఎండీఏ నుంచి 50 వేల మొక్కలను సేకరించాలని, అందుబాటులో ఉన్న గ్రీన్ బడ్జెట్‌ను వంద శాతం వినియోగించుకోవాలని సూచించారు. తాండూరులో పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని, ప్రతి దుకాణం ఎదురుగా మొక్కలను నాటించి సంరక్షణ బాధ్యతలు వారికే అప్పగించాలన్నారు. మైనింగ్, సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో మాట్లాడి, వారి భాగస్వామ్యంతో మొక్కలను నాటించాలని గనుల శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రైస్‌మిల్లులో 100 మొక్కలు, అంగన్వాడీ కేం ద్రంలో 20 మొక్కల చొప్పున నాటించడంతోపాటు సం రక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో 40 మొక్కలను నాటించాలని, జూన్ నెలలో సీఎం కేసీఆర్ జిల్లా కు వచ్చే అవకాశం ఉన్నందున వికారాబాద్ పట్టణంలో మూడు వరుసల్లో అవెన్యూ ప్లాంటేషన్‌ను పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. కార్యక్రమం లో వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.