పుట్టబోయే బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు.. గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన న్యూట్రిషన్ కిట్లకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. గత 13 నెలలుగా ఈ కిట్ల పంపిణీ ఆగిపోవడంతో జిల్లాలోని 9,000 మంది గర్భిణులకు సుమారు 18,000 న్యూట్రిషన్ కిట్లు అందలేదు.
మహిళ గర్భం దాల్చిన నుంచి ప్రసవించే వరకు రెండు విడుతలుగా రూ.2,000 విలువ చేసే పోషకాహారాలతో కూడిన కిట్లను గత కేసీఆర్ ప్రభుత్వం గర్భిణులకు పంపిణీ చేసింది. అయితే గతేడాది కిందట అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ ప్రభుత్వంలో ఈ కిట్ల పంపిణీ నిలిచిపోవడంతో పుట్టిన బిడ్డల్లో పోషకాహార లోపం సమస్యలు వస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
-వికారాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ)
Nutrition Kit | ఆరు గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. గత కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికోసం న్యూట్రిషన్, కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర సంక్షేమ పథకాలను దేశంలోనే ఎక్కడాలేని విధంగా అమలు చేసింది. అయితే కాంగ్రెస్ సర్కార్ కొత్త పథకాలు దేవుడెరుగు…కేసీఆర్ హయాంలో అమలైన ఏ ఒక్క పథకాన్నీ అమలు చేయడంలేదు.
ప్రధానంగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా, బల వర్థకంగా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన న్యూ ట్రిషన్ కిట్ల పంపిణీకి రాజకీయ గ్రహణం పట్టుకున్నది. మరోవైపు కేసీఆ ర్ కిట్ల పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ ఎంసీహెచ్ కిట్లుగా పేరు మార్చినప్పటికీ ఆ పంపిణీని పూర్తిగా నిలిపివేసింది. మహిళల సంక్షేమాన్ని గాలికి వదిలే సిన రేవంత్ ప్రభుత్వంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పుట్టబోయే శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన న్యూట్రిషన్ కిట్ల సరఫరా గతేడాదిగా నిలిచిపోయింది. దీంతో జిల్లాలో సుమారు 9,000 మంది గర్భిణులకు సుమా రు 18,000 న్యూట్రిషన్ కిట్లు అందలేదు. అయితే మహిళ గర్భం దాల్చి న నాటి నుంచి ప్రసవించే వరకు ఐదు, తొమ్మిది నెలల్లో రెండు విడుతలుగా రూ. 2,000 విలువ చేసే పోషకాహారాలతో కూడిన కిట్లను కేసీఆర్ ప్రభుత్వం అందజేసింది. ఆ కిట్లలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, రెండు కిలోల న్యూట్రిషన్ మిక్స్డ్ పౌడర్, కిలో ఖర్జూర, 500 గ్రాముల నెయ్యి, ఐరన్ సిరప్లు రెండు బాటిళ్లు, ఆల్బండెజోల్ ట్యాబ్లెట్లు తదితర వస్తువులు ఉండేవి. అయితే గతేడాదిగా ఈ కిట్ల పంపిణీ నిలిచిపోవడంతో పుట్టిన బిడ్డల్లో పోషకాహార లోపం సమస్యలు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
గర్భిణులు, పుట్టబోయే శిశువుల సంరక్షణతోపాటు ప్రభుత్వ దవాఖాన ల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్ల పథకం నిలిచిపోయిది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్పటి నుంచి ఆ పథకం అటకెక్కింది. అయితే ప్రభుత్వ దవాఖానల్లో పాప జన్మిస్తే రూ.13,000, బాబు పుడితే రూ.12,000 ఆర్థిక సాయాన్ని గత ప్రభుత్వం అందజేసింది. మహిళ గర్భం దాల్చిన అనంతరం నాలుగు విడతల్లో ఈ సాయాన్ని పంపిణీ చేసింది.
డెలివరీ తర్వాత శిశువు సంరక్షణ కోసం 16 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్లను అందజేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ల పథకాన్ని ఎంసీహెచ్ కిట్లుగా పేరు మార్చింది. కిట్లతోపాటు ఆర్థిక సాయాన్ని గతేడాదిగా ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు 2017 జూన్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ల పథకంతో ప్రభుత్వ దవాఖానలకు గర్భిణులు క్యూ కట్టారు. బీఆర్ఎస్ హయాంలో 37,176 మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ చేయగా, అమ్మఒడిలో భాగంగా సుమారు రూ.30 కోట్ల వరకు ఆర్థిక సాయాన్ని అందించారు.
బీఆర్ఎస్ హయాంలో కొనసాగిన పథకాలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయడం లేదు. గర్భిణులను దృష్టిలో పెట్టుకుని పంపిణీ చేసిన న్యూట్రిష న్ కిట్లు పేదలకు ఎంతో ఉపయోగపడ్డాయి. తనకు మొదటి ప్రసవం 15 మే 2023లో జరుగగ న్యూట్రిషన్ కిట్‌ను గత ప్రభుత్వం పంపిణీ చేసిం ది. దాంతోపాటు కేసీఆర్ కిట్, రూ.13,000 ఇచ్చి మరీ ఇంటి వద్దకు ప్రభుత్వ వాహనంలో పంపించారు. రెండో డెలివరీ 20 డిసెంబర్ 2024 న జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కిట్టూ ఇవ్వలేదు. ప్రభుత్వ పెద్దలు స్పందించి గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయాలి.
– ఎర్ర సంగీత, రావులపల్లి, మర్పల్లి
ఆరు నెలలవుతున్నా ఇప్పటికీ న్యూట్రిషన్ కిట్‌ను పంపిణీ చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో న్యూట్రిషన్ కిట్‌తోపాటు కేసీఆర్ కిట్నూ సకాలంలో పంపిణీ చేసేవారు. తనలాంటి వారికి న్యూట్రిషన్ కిట్లు ఇస్తే ఆరో గ్యంగా ఉంటాం. గత సర్కారు మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా కిట్లను పంపిణీ చేయాలి.
– ప్రియాంక, తొర్మామిడి, బంట్వారం