షాబాద్, నవంబర్ 12: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్ సూచించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల విధుల నిర్వహణ కోసం కలెక్టర్ వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు.
శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని కోర్టుహాల్లో నోడల్ అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. నోడల్ అధికారుల్లో మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, శిక్షణ, నామినేషన్లు, పరిశీలనకు-రాజేశ్వర్‌రెడ్డి(జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్), బ్యాలెట్ బాక్సు లు, బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్-శ్రీనివాస్‌రెడ్డి (డీపీవో), పోలింగ్ స్టేషన్లు-రవికుమార్(ఎస్డీసీ-ఎల్పీ) మెటీరియల్ మేనేజ్మెంట్-ప్రభాకర్(డీఆర్డీవో పీడీ), మోడల్ ప్రవర్తనానియమావళిని అమలు చేయడం- ఓంప్రకాశ్(సీపీవో), వ్యయ పర్యవేక్షణ-ధాత్రిదేవి(డీసీవో), పరిశీలకులు-శ్రీధర్ (డీఎస్సీడీవో)ఎంసీఎంసీ-పద్మశ్రీ(డీపీఆర్వో), డీఆర్సీ కేంద్రాలు-చంద్రకళ(ఆర్డీవో), నివేదికలు, రిటర్న్స్-జయశ్రీ(హెచ్-సెక్షన్), కొవిడ్-19 చర్యలను నిర్ధారించడం -స్వరాజ్యలక్ష్మి (జిల్లా వైద్యాధికారి), ఎలక్టోరల్ రోల్స్, మార్క్ చేసిన కాపీలు-దిలీప్‌కుమార్(జడ్పీ సీఈవో), వెబ్‌కాస్టింగ్, మైక్రో పరిశీలకులు -సునంద(జిల్లా ఉద్యానవన అధికారి), వాహనాల నిర్వహణ-రఘునందన్‌గౌడ్(ఆర్టీవో)లను నియమించినట్లు ఆయన తెలిపారు. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతీక్‌జైన్, తిరుపతిరావు, జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్, పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, ఉద్యానవనశాఖ అధికారి సునంద, సోషల్ వెల్ఫేర్ అధికారి శ్రీధర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.