ఆమనగల్లు, మే 5 : దేశంలోనే రైతులను ఆదుకున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్(BRS ) అని ఆ పార్టీ ఆమనగల్లు పట్టణ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆకాల వర్షాలకు తడిసిన ధాన్యం విషయంలో బీఆర్ఎస్ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అనడం సరైంది కాదన్నారు. రైతులను ఆదుకోవాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆయన గుర్తు చేశారు.
ధాన్యం భద్రపరచడానికి వ్యవసాయ మార్కెట్ అధికారులు టార్పాలిన్ కవర్లు ఇవ్వకపోవడం, హమీల సంఖ్య తక్కువగా ఉండటం, తేమ శాతం సరిగ్గా ఉన్న వడ్లు తూకం వేయకపోవడం వలనే వర్షానికి ధాన్యం తడిసిపోయాయని ఈవిషయంపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే రాజకీయాలు చేస్తున్నారాని అనడం కరెక్టు కాదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో రైతుల కల్లాల వద్దకు వాహనాలను పంపి అక్కడే కొనుగోలు చేశారానే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కువ మొత్తంలో ప్రారంభించి రైతులకు ఇబ్బందులకు లేకుండా చేశామన్నారు. ఇప్పటి కైనా ప్రభుత్వం రైతుల అవసరాలకు తగ్గట్టు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.