డంపింగ్ యార్డు పూర్తయ్యేనా..?
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 34 వార్డులు ఉన్నాయి. ప్రతిరోజూ చెత్తను సేకరించేందుకు 17 ఆటోలు, 6 ట్రాక్టర్లు ఉన్నాయి. ఒక్క ఆటో రెండు వార్డుల్లో చెత్తను సేకరించాల్సి ఉంటుంది.
- షెడ్లు, మిషనరీ పనులు జరిగేనా..?
- గుట్టలు, గుట్టలుగా పేరుకుపోతున్న చెత్త
- 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.3.82కోట్లు మంజూరైనా నిర్లక్ష్యమే..
- త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్న పట్టణ ప్రజలు
వికారాబాద్, మార్చి 28 : వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 34 వార్డులు ఉన్నాయి. ప్రతిరోజూ చెత్తను సేకరించేందుకు 17 ఆటోలు, 6 ట్రాక్టర్లు ఉన్నాయి. ఒక్క ఆటో రెండు వార్డుల్లో చెత్తను సేకరించాల్సి ఉంటుంది. డంపింగ్ యార్డు వికారాబాద్‌కు 3కిలో మీటర్ల దూరంలో వికారాబాద్ మండలం గోదుమగూడ వెళ్లే దారిలో ఉంది. గతంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు డంపింగ్ యార్డును 10 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చెత్తను డంపింగ్ యార్డుకు చేరవేస్తున్నారు. రోజుకు 26మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ యార్డుకు చేరుతున్నది.
గతంలో 14వ ఆర్థిక ప్రణాళిక నిధులు రూ.3.82కోట్లు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో డంపింగ్ యార్డు ప్రహరీ, సీసీ రోడ్లు, షెడ్లు, తడి, పొడి చెత్తను వేరు చేసే మిషనరీలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఖర్చు చేయాల్సి ఉంది. అప్పట్లో కాంట్రాక్టర్‌కు అప్పగించి పనులు ప్రారంభించారు. 2021లో వికారాబాద్ డంపింగ్ యార్డుకు రూ.18లక్షలతో సీసీ రోడ్డు పనులు చేశారు. రూ.49లక్షలతో డంపింగ్ యార్డు ప్రహరీ నిర్మించారు. డంపింగ్‌యార్డులో షెడ్డు నిర్మాణ పనులు కొనసాగాయి.
షెడ్డు ఏర్పాటు కోసం పిల్లర్లను సైతం ఏర్పాటు చేశారు. సుమారు రూ.2.07కోట్లు ఖర్చు కాగా, రూ.1.75 కోట్లు మిగిలినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. డంపింగ్ యార్డులో పనులు పూర్తి చేయకపోవడంతో రోజుకు 26 మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ యార్డుకు చేరుతుంది. దాదాపు 4 సంవత్సరాల నుండి చెత్తను డంపింగ్ యార్డులో వేయడంతో గుట్టుగుట్టలుగా పేరుకపోయింది. తడి,పొడి చెత్తను వేరు చేసే మిషన్లు అందుబాటులోకి వస్తే పొడి చెత్తను అమ్మి మున్సిపల్‌కు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కలెక్టర్, ప్రజాప్రతినిధులు స్పందించి వచ్చిన నిధులను వృథా చేయకుండా నిలిచిపోయిన పనులను పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని వికారాబాద్ పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

